ఫీడర్ అంబులెన్స్‌లో ప్రసవం
ABN, Publish Date - Mar 14 , 2025 | 10:32 PM
మండలంలోని రాజేంద్రపాలెం పంచాయతీ శనివారపుపాడుకు చెందిన గెమ్మెలి లింబో ఫీడర్ అంబులెన్స్‌లో గురువారం రాత్రి ప్రసవించింది.

తల్లీబిడ్డ క్షేమం
రాజేంద్రపురం పీహెచ్‌సీకి తరలింపు
కొయ్యూరు, మార్చి 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని రాజేంద్రపాలెం పంచాయతీ శనివారపుపాడుకు చెందిన గెమ్మెలి లింబో ఫీడర్ అంబులెన్స్‌లో గురువారం రాత్రి ప్రసవించింది. శనివారపుపాడుకు చెందిన లింబోకు గురువారం రాత్రి పురిటినొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని కుటుంబీకులు ఫీడర్ అంబులెన్స్‌కు సమాచారమందించారు. వెంటనే అంబులెన్స్‌తో గ్రామానికి చేరుకున్న ఈఎంటీ విజయ్‌కుమార్ గర్భిణి లింబోను రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటినొప్పులు అధికం కావడంతో ప్రసవించింది. దీనిని గుర్తించిన ఈఎంటీ శిశువును శుభ్రం చేసి తల్లికి అందించి మెరుగైన వైద్య సేవలకు పీహెచ్‌సీకు తరలించారు. సకాలంలో అంబులెన్స్ తీసుకువచ్చి సురక్షితంగా ప్రసవించేలా చర్యలు తీసుకున్న ఈఎంటీకి కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - Mar 14 , 2025 | 10:32 PM