చల్లబడిన మన్యం

ABN, Publish Date - Apr 05 , 2025 | 11:35 PM

మన్యంలో శనివారం ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణం చల్లబడింది.

చల్లబడిన మన్యం
పాడేరులో శనివారం పొగమంచుకు లైట్లు వేసుకున ్న ఆర్‌టీసీ బస్సు

ఉదయం నుంచి మబ్బు వాతావరణం

రెండు గంటల తర్వాత కురిసిన వాన

సేదదీరిన మన్యం వాసులు

పాడేరు, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): మన్యంలో శనివారం ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణం చల్లబడింది. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని ఏజెన్సీలోని అన్ని మండలాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు కురిసింది. తర్వాత నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆకాశం మేఘావృతమై ఎండ పెద్దగా కాయలేదు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత గంట సేపు వర్షం కురిసింది. అలాగే జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాలతోపాటు ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు ప్రాంతాల్లో మోస్తరుగా వర్షం పడింది.

కొయ్యూరులో 36.5 డిగ్రీల ఉష్ణోగ్రత

ఏజెన్సీలో శనివారం పొగమంచు, వర్షం కురిసినప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పులేదు. కొయ్యూరులో 36.5 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా జీకేవీధిలో 34.4, డుంబ్రిగుడలో 33.5, అరకులోయలో 31.9, హుకుంపేట, చింతపల్లి, పెదబయలు,లో 31.7, అనంతగిరిలో 30.5, జి.మాడుగులలో 30.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 05 , 2025 | 11:35 PM