ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పండగకు వచ్చి అనంత లోకాలకు..

ABN, Publish Date - Jan 16 , 2025 | 12:02 AM

పండగ నేపథ్యంలో అందరూ ఆనందంగా గడుపుతుండగా ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారి కారు ఢీకొనడంతో మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలాఉన్నాయి.

కారు ఢీకొని ఐదేళ్ల బాలిక మృతి

గాజువాక, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): పండగ నేపథ్యంలో అందరూ ఆనందంగా గడుపుతుండగా ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారి కారు ఢీకొనడంతో మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలాఉన్నాయి. సుజాతనగర్‌ ప్రాంతానికి చెందిన బి.నవీన్‌కుమార్‌ విదేశాల్లో ఉంటుండగా, ఆయన భార్య, కుమార్తె లార్ని (5) ఇక్కడే ఉంటున్నారు. సంక్రాంతి పండక్కి గాజువాకలో గల సెలెస్ట్‌ అపార్ట్‌మెంటులో ఉంటున్న తాతాయ్య వాళ్లింటికి లార్ని తల్లితో కలిసి వచ్చింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో కొంతమంది పిల్లలతో కలిసి లార్ని ఆడుకుంటుండగా.. ఓ వ్యక్తి సెల్లార్‌ నుంచి కారును బయటకు తీస్తూ బలంగా ఆ బాలికను ఢీకొన్నాడు. లార్ని తలపై నుంచి కారు చక్రాలు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. హూటాహూటిన బాలికను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 16 , 2025 | 12:02 AM