నూకాంబిక అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:34 AM
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కొత్త అమావాస్య జాతర ప్రారంభమైన తరువాత ఇంత పెద్ద సంఖ్యలో భక్తుల ఆలయానికి రావడం ఇదే ప్రథమం. తెల్లవారుజామున ఐదు గంటలకే భక్తులు బారులు తీరారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తుల తాకిడి బాగా పెరిగింది. ఆలయం ఆవరణలో క్యూలైన్లు నిండిపోవడంతో రోడ్డు వరకు క్యూలు పెరిగాయి. బాలాలయంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కొంతమంది పక్కనే ఉన్న తోటల్లో వంటలు చేసుకుని మధ్యాహ్నం భోజనాలు చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఉత్సవ ప్రత్యేకాధికారి శోభారాణి, ఈవో రాంబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అనకాపల్లి టౌన్/ ఆంధ్రజ్యోతి