ఇంటర్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ షురూ
ABN, Publish Date - Apr 03 , 2025 | 11:57 PM
పాడేరు డివిజన్ పరిధిలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు, 11 కస్తూర్బాగాంధీ బాలికల కళాశాలలకు పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాల పంపిణీ చేపడుతున్నామని డీఐఈవో కొత్తపల్లి అప్పలరామ్ తెలిపారు.

డివిజన్‌లో 9 ప్రభుత్వ జూనియర్, 11 కేజీబీవీ కళాశాలలకు సరఫరా
పాడేరురూరల్, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): పాడేరు డివిజన్ పరిధిలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు, 11 కస్తూర్బాగాంధీ బాలికల కళాశాలలకు పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాల పంపిణీ చేపడుతున్నామని డీఐఈవో కొత్తపల్లి అప్పలరామ్ తెలిపారు. ఈ నెల ఒకటవ తేదీ నుంచి ద్వితీయ ఇంటర్ తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో ప్రతీ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థికి పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలతో పాటు 12 నోట్ పుస్తకాలు అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా పాడేరు ఐటీడీఏ పరిధిలోని 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు 60,948 నోట్ పుస్తకాలతో పాటు పాఠ్య పుస్తకాలను, 11 కస్తూర్బాగాంధీ బాలికల కళాశాలలకు 10,428 నోట్ పుస్తకాలతో పాటు పాఠ్య పుస్తకాలను సరఫరా చేస్తున్నామన్నారు. అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పాఠ్య పుస్తకాలతో పాటు 3,948 నోట్ పుస్తకాలు, అరకు జీజే కళాశాలకు 8,100, చింతపల్లి కళాశాలకు 6,084, డుంబ్రిగుడకు 5,592, జి.మాడుగులకు 8,820, జీకేవీధికి 1,464, హుకుంపేటకు 6,840, ముంచంగిపుట్టుకు 7,092, పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 13,008 నోట్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే అనంతగిరి మండలం కొత్తూరు కేజీబీవీకి 924 నోట్ పుస్తకాలు, అరకులోయ మండలం ఎండపల్లివలస కేజీబీవీకి 960, చింతపల్లి మండలం తాజంగికి 960, డుంబ్రిగుడకి 948, జి.మాడుగులకు 936, జీకేవీధికి 936, హుకుంపేటకు 960, కొయ్యూరు మండలం రాజేంద్రపాలేనికి 960, ముంచంగిపుట్టు మండలం కిలగాడకు 924, పాడేరు మండలం లగిశపల్లికి 960, పెదబయలు కేజీబీవీకి 960 నోట్ పుస్తకాలను సరఫరా చేస్తున్నామన్నారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు తక్షణమే పాఠ్య, నోట్ పుస్తకాలను విద్యార్థిని, విద్యార్థులకు సరఫరా చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కె.సింహాచలం నాయుడు, సీహెచ్ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 03 , 2025 | 11:57 PM