ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గుంతల రోడ్లకు సెలవిక!

ABN, Publish Date - Jan 13 , 2025 | 12:40 AM

‘సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు బయలుదేరిన ప్రజలంతా గోతుల రోడ్లపై ప్రయాణం నరకమనే భయాందోళన నుంచి బయటపడాలి.

రహదారులను అందగా తీర్చిదిద్దిన కూటమి సర్కారు

సంక్రాంతికి పూడ్చివేస్తామని ముందుగానే ప్రకటన

అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాచరణ

జిల్లాలో మూడొంతుల రోడ్లపై పూర్తైన పనులు

తుఫాన్‌ కారణంగి మిగిలినవి ఈ నెలాఖరుకు పూర్తి

విశాఖపట్నం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి):

‘సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు బయలుదేరిన ప్రజలంతా గోతుల రోడ్లపై ప్రయాణం నరకమనే భయాందోళన నుంచి బయటపడాలి. ఇందుకోసం తగిన కార్యాచరణ సిద్ధం చేసి, పండగ సమయానికి గోతులన్నీ పూడ్చివేయాలి. ఇందుకోసం నిధులు మంజూరు చేస్తున్నామని రెండు నెలలు కిందట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోడ్లు, భవనాలశాఖ సమీక్ష సందర్భంగా ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలో దాదాపు మూడొంతుల రహదారులపై గుంతలను అధికారులు ఇప్పటికే పూడ్చివేసి, ప్రయాణ కష్టాలను దూరం చేశారు. మరికొన్ని చోట్ల ఇటీవల తుఫాన్‌ కారణంగా కొంతవరకు పెండింగ్‌లో పడిన పనులను ఈనెలాఖరుకు పూర్తిచేయన్నారు.

గత వైసీపీ హయాంలో పూర్తిస్థాయి గోతులతో నిండిపోయి అధ్వాన స్థితికి చేరిన రోడ్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు.. ప్రస్తుతం మారిన రూపరేఖలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలు కిందట చూసిన రోడ్లకు, ప్రస్తుత రహదారులకు పొంతన లేదని, గుంతలు లేని రోడ్లపై ప్రయాణం ప్రమాదాలను దూరం చేసిందని పేర్కొంటున్నారు.

40 కిలో మీటర్ల గుంతలు పూడిక..

జిల్లాలో రోడ్లు, భవనాలశాఖ పరిధిలో 253 కిలో మీటర్లు రహదారులున్నాయి. ఇందులో 70 కిలోమీటర్లు మేర రోడ్లపై గుంతులు ఉన్నట్టు అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. వీటిలో రాష్ట్ర రహదారులు 20 కిలోమీటర్లు కాగా, జిల్లా రహదారులు 50 కిలోమీటర్లు. ఈ రోడ్లపై గుంతలను సంక్రాంతి నాటికి పూడ్చి వేసేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో, దానికి అనుగుణంగా రూ.1.38 కోట్లను మంజూరు చేసింది. దీంతో అధికారులు ప్రక్రియ వేగవంత చేశారు. టెండర్లు పూర్తి చేసి నెలన్నర కిందట పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 40 కిలోమీటర్లు మేర రోడ్లపై గుంతలను పూర్తిగా పూడ్చేశారు. మరో పది కిలోమీటర్లు మేర గుంతలను దాదాపు 70 శాతం మేర పూడ్చినట్టు చెబుతున్నారు. మరో 20 కిలోమీటర్లు పనులు ప్రారంభదశలో ఉన్నాయన్నారు. ఇటీవల తుఫాన్‌ కారణంగా కొన్నిచోట్ల పనుల్లో జాప్యం నెలకొందని, లేదంటే ఇప్పటికే అన్ని పనులు పూర్తయ్యేవని అధికారులు చెబుతున్నారు.

పూర్తయిన రోడ్లు ఇవే..

ఇప్పటివరకు ఆనందపురం మండలంలోని నీల కుండీలు జంక్షన్‌ నుంచి సింహాచలం వరకు ఆరు కిలో మీటర్లు, భీమిలి నుంచి దొరతోట జంక్షన్‌ వరకు ఎనిమిది కిలో మీటర్లు రోడ్డు, పద్మనాభం నుంచి నీల కుండీలు జంక్షన్‌ వరకు ఆరు కిలోమీటర్లు రోడ్లపై గుంతలు పూడ్చివేశారు. ఇక రాష్ట్ర రహదారుల విషయానికి వస్తే అల మండ రైల్వేస్టేషన్‌ నుంచి పాండ్రంగి మార్గంలో ఆరు కిలోమీటర్లు, తగరపువలస మహరాజుపేట జంక్షన్‌ నుంచి పద్మనాభం వరకు 11 కిలోమీటర్లు, సింహాచలం దొబ్బ రోడ్డు నాలుగు కిలోమీటర్లు, అడవివరం నుంచి బొడ్డునాయుడుపాలెం పది కిలోమీటర్లు, పద్మనాభం మండలంలోని చిన్నాపురం జంక్షన్‌ నుంచి నేరెళ్లవలస ఐదు కిలో మీటర్లు, భీమిలి మండలం తగరపువలస నుంచి తాటితూరు ఐదు కిలోమీటర్లు, బోని జంక్షన్‌ నుంచి పాండ్రంగి వరకు ఐదు కిలోమీటర్లు, గుడివాడ నుంచి అన్నవరం వరకు ఐదు కిలోమీటర్లు గుంతుల పూడ్చివేత పనులు సాగుతున్నాయి. వీటిలో రెండు చోట్ల 70 శాతం పూర్తయినట్టు అధికారులు తెలిపారు.

Updated Date - Jan 13 , 2025 | 12:40 AM