ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా సంక్రాంతి సంబరాలు

ABN, Publish Date - Jan 14 , 2025 | 12:18 AM

స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంపీ సీఎం రమేశ్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.

హరిదాసుకు కానుకలు అందజేస్తున్న ఎంపీ సీఎం రమేశ్‌

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

హాజరైన ఎంపీ, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు

అనకాపల్లి టౌన్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంపీ సీఎం రమేశ్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ముందుగా సీఎం రమేశ్‌ దంపతులు స్టేడియంలో భోగి మంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలకు శ్రీకారం చుట్టారు. హరిదాసులకు కానుకలను అందజేశారు. అనంతరం కళాకారుల చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీ సీఎం రమేశ్‌ దంపతులు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్‌ఎన్‌ రాజు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, టీడీపీ నాయకులు పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్యబాబు, మళ్ల సురేంద్ర, కోట్ని బాలాజీ, మాదంశెట్టి నీలబాబు, పీవీజీ కుమార్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తదితరులు ఆశీనులై సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా చిన్నారుల భరతనాట్యం, మణిపాల్‌కు చెందిన యువకుల విన్యాసాలు, గిరిజన కళాకారుల థింసా నృత్యం, పట్టణానికి చెందిన సాముగరిడి, తప్పెటగుళ్లు, పులివేషాలు, వివిధ జానపద నృత్యాలు స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేశ్‌ జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే స్టేడియం ఆవరణలో నిర్వహించిన క్రికెట్‌ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.

Updated Date - Jan 14 , 2025 | 12:18 AM