ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేజీబీవీ విద్యార్థినులకు మళ్లీ అస్వస్థత

ABN, Publish Date - Jan 11 , 2025 | 10:59 PM

అతిసార బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిన ఆరుగురు కేజీబీవీ విద్యార్థినులు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం డిశ్చార్జి అయిన విద్యార్థినులకు విరేచనాలు అవుతుండడంతో శనివారం ఉదయం కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రికి తీసుకు వచ్చి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు.

ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి గురించి సిబ్బందితో మాట్లాడుతున్న డీఈవో

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే అనారోగ్యం

ఏరియా ఆస్పత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు

నర్సీపట్నం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): అతిసార బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిన ఆరుగురు కేజీబీవీ విద్యార్థినులు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం డిశ్చార్జి అయిన విద్యార్థినులకు విరేచనాలు అవుతుండడంతో శనివారం ఉదయం కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రికి తీసుకు వచ్చి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. డీఈవో గిడ్డి అప్పారావునాయుడు చికిత్స పొందుతున్న విద్యార్థినుల కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రిన్సిపాల్‌తో సహా ముగ్గురికి షోకాజ్‌ నోటీసులు

కేజీబీవీ ప్రిన్సిపాల్‌ శాంతి, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ కో- ఆర్డినేటర్‌ జయప్రకాశ్‌, డీసీడీవో పద్మకి షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్టు డీఈవో అప్పారావునాయుడు తెలిపారు. మంగళవారం విద్యార్థినులు విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురైన వెంటనే సకాలంలో సమాచారం ఇవ్వనందుకు సంజాయిషీ కోరుతూ ముగ్గురికి నోటీసులు అందజేశారు.

Updated Date - Jan 11 , 2025 | 10:59 PM