Share News

Daggubati Purandeswari: మోదీ పర్యటన.. ఎంపీ పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 07 , 2025 | 06:02 PM

Daggubati Purandeswari: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

Daggubati Purandeswari: మోదీ పర్యటన.. ఎంపీ పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
BJP MP Daggubati Purandeswari

విశాఖపట్నం, జనవరి 07: విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి సోపానమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం తొలిసారిగా ఆయన విశాఖపట్నం వస్తున్నారని ఆమె గుర్తు చేశారు. ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌‌లో సభా ఏర్పాట్లను మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చూడుతున్నారన్నారు.

విశాఖపట్నంలో స్టీల్‌ప్లాంట్‌ని గాడిలో పెట్టాలని కేంద్రం భావిస్తోందన్నారు. మంచి ప్యాకేజి ఇచ్చి స్టీల్‌ప్లాంట్‌ను ఆదుకోవాలని ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి ఆలోచిస్తున్నారని తెలిపారు. అలాగే స్టీల్ ప్లాంట్ జీతాల విషయాన్ని సైతం కేంద్ర మంత్రి పరిశీలిస్తున్నారని ఆమె వివరించారు. అయితే హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ కార్యాలయంపై దాడిపై సైతం ఆమె స్పందించారు. ఈ దాడికి కారణమైన వారిని గుర్తించి.. వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆమె సూచించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడి శోచనీయమని.. ఈ తరహా దాడి ఎవరు చేసినా వ్యతిరేకించాలని దుగ్గుబాటి పురేందేశ్వరి అభిప్రాయపడ్డారు.


ప్రధాని నరేంద్ర మోదీ.. బుధవారం అంటే జనవరి 8వ తేదీన విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద జాతీయ హరిత హైడ్రోజన్‌ మిషన్‌ కింద తొలి గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌‍కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే దాదాపు రూ. 1.85 లక్షల కోట్లు పెట్టుబడితో.. అత్యాధునిక ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ప్రాజెక్టుకు సైతం ఆయన శంకుస్థాపన చేస్తారు.

Also Read: కేటీఆర్ కేసులో హైకోర్టు ఆర్డర్ కాపీలో కీలక అంశాలు

Also Read: భూకంపం: 95 మంది మృతి


ఇక ఏపీలో చేపడుతోన్న రూ.19,500 కోట్ల విలువైన రైల్వే, రహదారి ప్రాజెక్టులకు సంబంధించి పలు పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మరికొన్నింటిని ఆయన ప్రారంభించనున్నారు. అందులోభాగంగా విశాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ చేతుల మీదగా శంకుస్థాపన జరగనుంది. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖపట్నంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే నగరంలోని ట్రాఫిక్‌ను సైతం వివిధ మార్గాల్లోకి మళ్లించనున్నారు.

Also Read: మరికొద్ది రోజుల్లో బడ్జెట్ .. ఎలా ఉండబోతోంది?

For AndhraPradesh New And Telugu News

Updated Date - Jan 07 , 2025 | 06:02 PM