PM Modi: విశాఖ ఎయిర్‌పోర్టుకు ప్రముఖుల తాకిడి
ABN, Publish Date - Jan 08 , 2025 | 11:48 AM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు ప్రముఖుల తాకిడి పెరిగింది. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను మరో ఎత్తుకు చేర్చుతూ రూ.రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు.
విశాఖ: విశాఖపట్టణం విమానాశ్రయానికి (Visakha Airport) ప్రముఖుల తాకిడి (Celebrity Crush) పెరిగింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం మీదుగా నోవోటెల్ హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 .55 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) వస్తారు. ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన పోర్ట్ గెస్ట్ హౌస్‌కు చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 4.20 గంటలకు విశాఖ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి (PM Modi) సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలుకుతారు. అనంతరం రోడ్డు మార్గాన తాటి చెట్ల పాలెం జంక్షన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సిరిపురం దత్ ఐలాండ్ మీదుగా వెంకటాద్రి వంటిల్లుకు ప్రధాని చేరుకుంటారు సాయంత్రం 4:40 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్ షో ప్రారంభమవుతుంది. వెంకటాద్రి వంటిల్లు నుంచి త్రీ టౌన్ జంక్షన్ మీదుగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానం వరకు రోడ్ షో జరుగుతుంది. అనంతరం సాయంత్రం 5.30 గంటల నుంచి 6.45 గంటల వరకు ప్రధాని సభా వేదికపై ఉంటారు.. తర్వాత 7.10 గంటలకు రోడ్డు మార్గాన విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని 7.15 గంటలకు ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ వెళతారు.
కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) బుధవారం విశాఖ (Visakha) పర్యటనకు (Visit) వస్తున్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను మరో ఎత్తుకు చేర్చుతూ రూ.రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఏర్పాటుచేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్ విలువే రూ.1.85లక్షల కోట్లు. రహదారులు, రైల్వే పనుల అంచనా రూ.19.5 వేల కోట్లు. వీటితోపాటు మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. కొత్తగా నిర్మించిన, విస్తరించిన ఆరు రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ మార్గంలోని రహదారిని ప్రత్యేక బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 1.5 లక్షల మందిని సమీకరిస్తున్నారు. సభ వేదికపై మోదీతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు, పవన్‌కల్యాణ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యుడు సుందరపు విజయకుమార్ ఉంటారు. ప్రధానికి కుడి వైపున గవర్నర్, ఎడమ వైపున ముఖ్యమంత్రికి సీట్లు కేటాయించారు. పవన్‌కల్యాణ్, చంద్రబాబు ప్రసంగించిన తరువాత ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫలకాలు ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తారు. ప్రధాని ప్రసంగాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు అనువదిస్తారు.
శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు..
ప్రధాని మోదీ విశాఖ సభా వేదికగా 12కు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ఆరుకు పైగా రహదారులను జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పనుల విలువ దాదాపు రూ. రెండు లక్షల కోట్ల పైమాటే. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ రూ.1.85 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు. 57 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టును 1,600 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సు..
చంద్రబాబు, పవన్‌పై ఎంపీ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణరథం
రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు
కేసులను న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటా: కేటీఆర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 08 , 2025 | 11:48 AM