ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంబరంగా భోగి

ABN, Publish Date - Jan 14 , 2025 | 12:59 AM

సంక్రాంతి కి ముందురోజు జరిగే భోగి పండుగను నగరవాసులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే అపార్టుమెంట్లు, కాలనీల్లో యువత సంప్రదాయ దుస్తులు ధరించి ఎక్కడికక్కడ భోగి మంటలు వేశారు. చిన్నారుల నుంచి వయోవృద్ధుల వరకూ అందరూ భోగి మంటల వద్ద చలికాస్తూ పండగను ఎంజాయ్‌ చేశారు. సింహాగిరిపై భోగి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఏటా సింహగిరిపై సంక్రాతి సంబరాలు రెండురోజులు నిర్వహిస్తారు. ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు కొండపై సంక్రాంతి సంబరాలను సోమవారం ప్రారంభించారు. కొండపై గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాటుచేసిన సెట్‌ సందర్శకులను ఆకట్టుకుంది. సంక్రాంతి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పరిస్థితులు ప్రతిబంబించేలా వరి కుప్పలు, ఎద్దులు, ట్రాక్టర్లు, పూరిగుడిసెలు, ధాన్యపురాశులు వేశారు.

ఘనంగా జరుపుకున్న నగర వాసులు

ప్రతి వీధిలో భోగి మంటలతో సందడి

సింహగిరిపై అంబరాన్నంటిన సంబరాలు

బీచ్‌రోడ్డులో పర్యావరణహితంగా ఆవు పిడకలతో భోగిమంట

విద్యుత్‌ బిల్లులు భోగిమంటల్లో వేసి సీఐటీయూ వినూత్న నిరసన

విశాఖపట్నం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి కి ముందురోజు జరిగే భోగి పండుగను నగరవాసులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే అపార్టుమెంట్లు, కాలనీల్లో యువత సంప్రదాయ దుస్తులు ధరించి ఎక్కడికక్కడ భోగి మంటలు వేశారు. చిన్నారుల నుంచి వయోవృద్ధుల వరకూ అందరూ భోగి మంటల వద్ద చలికాస్తూ పండగను ఎంజాయ్‌ చేశారు. సింహాగిరిపై భోగి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఏటా సింహగిరిపై సంక్రాతి సంబరాలు రెండురోజులు నిర్వహిస్తారు. ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు కొండపై సంక్రాంతి సంబరాలను సోమవారం ప్రారంభించారు. కొండపై గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాటుచేసిన సెట్‌ సందర్శకులను ఆకట్టుకుంది. సంక్రాంతి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పరిస్థితులు ప్రతిబంబించేలా వరి కుప్పలు, ఎద్దులు, ట్రాక్టర్లు, పూరిగుడిసెలు, ధాన్యపురాశులు వేశారు. డూడూ బసవన్నలు, హరిదాసుల కీర్తనలు, తప్పెటగుళ్లు, మహిళల చెక్కభజన, కుమ్మరిచక్రంతో మట్టి ప్రమిదల తయారీ, పులివేషాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కట్టిపడేశాయి. కొండపైకి భారీ సంఖ్యలో భక్తులు చేరడంతో సందడి వాతావరణం నెలకొంది. యువతులు, మహిళలు ధాన్యపురాశుల్లో నుంచి చేతితో ధాన్యాన్ని తీసి గాలిపడుతూ గ్రామీణ ప్రాంత అనుభూతులను సొంతంచేసుకున్నారు. సీతమ్మధారలోని ఆక్సిజన్‌ టవర్స్‌ వద్ద భోగి మంటలు వేసి అపార్ట్‌మెంట్‌లోని నివాసితులు పండగ చేసుకున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో విద్యుత్‌ చార్జీల పెంపుని నిరసిస్తూ కరెంట్‌ బిల్లులను భోగిమంటల్లో వేసి తమ నిరసన తెలిపారు. పద్మనాభం మండలం కృష్ణాపురంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలు చేస్తున్న 25 మంది సంప్రదాయ వస్త్రధారణతో సామూహిక భోగి మంట వేశారు. బీచ్‌రోడ్డులో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో దేశీయగోవు పేడతో తయారుచేసిన లక్ష పిడకలతో బీచ్‌రోడ్డులోని వైఎంసీఏ ఎదుట భోగిమంట వేశారు. కాగా తారురోడ్లపై భోగి మంటలు వేయవద్దని జీవీఎంసీ కమిషనర్‌ పి.సంపత్‌కుమార్‌ చేసిన విజ్ఞప్తిని ప్రజలు పట్టించుకోకుండా రహదారులపైనే మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు.

Updated Date - Jan 14 , 2025 | 12:59 AM