టీడీపీ సీనియర్‌ నేత శేషుకుమార్‌ మృతి

ABN, Publish Date - Mar 30 , 2025 | 01:11 AM

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు రుత్తల శేషుకుమార్‌(47) కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శనివారం మృతి చెందారు. తెలుగుదేశం పారీ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఆ పార్టీ సీనియర్‌ నేత మృతి చెందడంతో శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

టీడీపీ సీనియర్‌ నేత శేషుకుమార్‌ మృతి
శేషుకుమార్‌ (ఫైల్‌ ఫొటో)

- శుక్రవారమే నర్సీపట్నం ఏఎంసీ చైర్మన్‌గా నియామకం

- స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు దిగ్ర్భాంతి

మాకవరపాలెం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు రుత్తల శేషుకుమార్‌(47) కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శనివారం మృతి చెందారు. తెలుగుదేశం పారీ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఆ పార్టీ సీనియర్‌ నేత మృతి చెందడంతో శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా రుత్తల శేషుకుమార్‌ నియమితులయ్యారు. శేషుకుమార్‌ మాకవరపాలెంలో బలమైన టీడీపీ నేతగా ఎదిగారు. ఆయనకు భార్య కృష్ణవేణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శేషుకుమార్‌ సర్పంచ్‌గా, జడ్పీటీసీగా, రెండుసార్లు టీడీపీ మండల అధ్యక్షులుగా పనిచేశారు. అలాగే ఆయన తల్లి చిన్నయ్యమ్మ ఎంపీపీగా పనిచేశారు. ఆయన మరణవార్త విన్న వెంటనే స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, సతీమణి చింతకాయల పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌ మాకవరపాలెం చేరుకొని పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. శేషుకుమార్‌కు నివాళులర్పించిన వారిలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆర్‌వై పాత్రుడు, టీడీపీ సీనియర్‌ నాయకులు అల్లు రామునాయుడు, నంద కిషోర్‌, రుత్తల జోగిపాత్రుడు తదితరులు ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌, ఎంపీపీ రుత్తల సర్వేశ్వరరావు నివాళులర్పించారు.

Updated Date - Mar 30 , 2025 | 01:11 AM