పర్యాటకుల తాకిడి అంతంతమాత్రమే..
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:37 AM
మన్యంలో ఆదివారం పర్యాటకుల సందడి తగ్గింది. ప్రస్తుతం విద్యార్థులకు సంవత్సరాంతపు పరీక్షలు జరుగుతుండడంతో పాటు పర్యాటక సీజన్ సైతం ముగుస్తుండడంతో ఏజెన్సీని పర్యాటకులు అంతంతమాత్రంగా సందర్శించారు. అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పెద్దగా సందడి కనిపించలేదు. ఫలితంగా అనంతగిరి మండలం బొర్రా గుహలు, కటిక, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాలకొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జల విహారి, పెదబయలు మండలంలో తారాబు జలపాతం, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతానికి పర్యాటకులు స్వల్పంగానే వచ్చారు.

- విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లో తగ్గిన సందడి
పాడేరు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఆదివారం పర్యాటకుల సందడి తగ్గింది. ప్రస్తుతం విద్యార్థులకు సంవత్సరాంతపు పరీక్షలు జరుగుతుండడంతో పాటు పర్యాటక సీజన్ సైతం ముగుస్తుండడంతో ఏజెన్సీని పర్యాటకులు అంతంతమాత్రంగా సందర్శించారు. అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పెద్దగా సందడి కనిపించలేదు. ఫలితంగా అనంతగిరి మండలం బొర్రా గుహలు, కటిక, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాలకొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జల విహారి, పెదబయలు మండలంలో తారాబు జలపాతం, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతానికి పర్యాటకులు స్వల్పంగానే వచ్చారు.
లంబసింగిలో..
చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు తరలి వచ్చారు. అయితే ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో సందర్శకుల తాకిడి స్వల్పంగానే ఉంది. వచ్చిన కొద్ది మంది పర్యాటకులు కూడా ఉదయం ఐదు గంటల నుంచే లంబసింగి జంక్షన్, చెరువులవేనంలో మంచు అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేశారు.
Updated Date - Feb 10 , 2025 | 12:37 AM