Share News

ఈదురుగాలుల బీభత్సం

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:57 AM

జిల్లాలో శనివారం మధ్యాహ్నం పలుచోట్ల వర్షం కురిసింది. నర్సీపట్నం, దేవరాపల్లి, మాడుగుల, నక్కపల్లిలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. నాతవరం మండలంలో కురిసిన వర్షాలకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఈదురుగాలుల బీభత్సం
నర్సీపట్నం గచ్చపువీధిలో నేలకొరిగిన విద్యుత్‌ స్తంభం

- నర్సీపట్నం, కోటవురట్ల, దేవరాపల్లి, మాడుగులలో నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు

- పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

అనకాపల్లి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి/న్యూస్‌ నెట్‌వర్క్‌): జిల్లాలో శనివారం మధ్యాహ్నం పలుచోట్ల వర్షం కురిసింది. నర్సీపట్నం, దేవరాపల్లి, మాడుగుల, నక్కపల్లిలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. నాతవరం మండలంలో కురిసిన వర్షాలకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి, కశింకోట, మునగపాక, ఎలమంచిలి, పరవాడ, గొలుగొండ, పాయకరావుపేట, సబ్బవరం, రాంబిల్లి మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. చోడవరం, బుచ్చెయ్యపేట, రోలుగుంట, ఎస్‌.రాయవరం, కె.కోటపాడు మండలాల్లో ఒక మోస్తరు వర్షం పడింది. రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గడమే కాకుండా చల్లని వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం నుంచి ఎండ తీవ్రతతో అల్లాడిన జనం మధ్యాహ్నం వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందారు.

21 విద్యుత్‌ స్తంభాలు నేలమట్టం

దేవరాపల్లి: మండలంలో ఈదురుగాలుల బీభత్సానికి పది గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం 21 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఏఈఈ కర్రి శంకరరావు ఆధ్వర్యంలో శనివారం యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. కొత్తపెంట కోనేరు వద్ద 5, వేచలం చీకటి తోట వద్ద 4, ఎన్‌.గజపతినగరంలో 2, వేచలం గ్రామంలో నాలుగు, కలిగొట్ల బండారుపాలెం 2, బి.కింతాడ కొత్తూరులో 4 విద్యుత్‌ స్తంభాలు నేలకొరగగా, పునరుద్ధరణ పనులు చేపట్టారు. శనివారం సాయంత్రం కూడా బలమైన గాలులు వీచడంతో కొత్తపెంట, వేచలం, ఎం.అలమండ, ముషిడిపల్లి, ఎన్‌గజపతినగరం, ములకలాపల్లి, కలిగొట్ల, బి.కింతాడ, తదితర గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Updated Date - Apr 06 , 2025 | 12:57 AM