ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం

ABN, Publish Date - Jan 02 , 2025 | 12:41 AM

నూతన సంవత్సర వేడు కల్లో విషాదం చోటుచే సుకుంది. బాణసంచా కాలుస్తుండగా బాంబు పేలి ఓ వ్యక్తి దుర్మర ణం చెందారు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

బాణసంచా కాలుస్తుండగా బాంబు పేలి కాంట్రాక్టు కార్మికుడు దుర్మరణం

కూర్మన్నపాలెం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడు కల్లో విషాదం చోటుచే సుకుంది. బాణసంచా కాలుస్తుండగా బాంబు పేలి ఓ వ్యక్తి దుర్మర ణం చెందారు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 87వ వార్డు పరిధి వడ్లపూడి రజక వీధిలో సుద్దమల శివ (41), భార్య ధనలక్ష్మి, కుమార్తె, కుమారు డితో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా తమ డాబాపై ఆనందంగా గడుపుతూ అర్ధరాత్రి 12 గంటల సమయంలో కేక్‌ కట్‌ చేశారు. అనంతరం బాణసంచా కాల్చారు. ఈ క్రమంలో గన్‌షాట్స్‌ కాల్చగా అవి పేలలేదు. దీంతో ఏమైందోనని దగ్గరకు వెళ్లి చూస్తున్న సమయంలో ఒక్కసారిగా అవి పేలి ఆయన కళ్లను బలంగా తాకాయి. దీంతో ఆయన ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అయినప్పటికీ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే శివ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌ తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 02 , 2025 | 12:41 AM