ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వికసించని వన్‌ధన్‌ వికాస కేంద్రాలు

ABN, Publish Date - Jan 11 , 2025 | 10:11 PM

స్వయం సహాయక సంఘాలకు చేయూతనిచ్చి వాటిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన వన్‌ధన్‌ వికాస కేంద్రాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు, పాలకుల నిర్లక్ష్యానికి లక్షలాది రూపాయలు వృథా అయ్యాయి.

శానిటరీ నాప్‌కిన్‌ తయారీ ముడి సరకు పాడైపోతున్న దృశ్యం

నిరుపయోగంగా యంత్రాలు, ముడిసరుకు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం

ఆర్థికాభివృద్ధికి నోచుకోని మన్యం మహిళలు

పట్టించుకోని అధికారులు, పాలకులు

కొయ్యూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): స్వయం సహాయక సంఘాలకు చేయూతనిచ్చి వాటిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన వన్‌ధన్‌ వికాస కేంద్రాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు, పాలకుల నిర్లక్ష్యానికి లక్షలాది రూపాయలు వృథా అయ్యాయి. వివరాల్లోకి వెళితే..

స్వయం సహాయక సంఘ సభ్యుల ఆర్థికాభివృద్ధికి పాడేరు డివిజన్‌లోని మూడేళ్ల క్రితం 70 వన్‌ధన్‌ వికాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొయ్యూరు మండలంలో అంతాడ, మంప పంచాయతీ గంగవరం, శరభన్నపాలెం, డౌనూరు కేంద్రాల్లో వన్‌ధన్‌ వికాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఎమ్మెల్యే, ఎంపీలు వీటిని ప్రారంభించారు. వీటిలో అంతాడలో భవన సౌకర్యం ఉండగా.. డౌనూరులో గతంలో శానిటరీ నేప్‌కిన్‌ తయారీ కేంద్రం ఏర్పాటు చేసిన భవనంలోనే ఈ సెంటర్‌ను ప్రారంభించారు. మిగిలిన రెండు కేంద్రాలకు భవనాలు కేటాయిస్తామని పాలకులు, అధికారులు ప్రకటనలు చేశారే తప్ప కార్యరూపం దాల్చలేదు.

ఒకొక్క యూనిట్‌కు రూ.3.5 లక్షలతో మిషనరీలు కొనుగోలు చేశారు. శానిటరీ నాప్‌కిన్‌ తయారీ కేంద్రానికి రూ.10 లక్షలు వెచ్చించి చెన్నై నుంచి మిషనరీ తీసుకువచ్చారు. అంతేకాకుండా రూ.10 లక్షలు విలువ చేసే ముడి సరకును తీసుకువచ్చారు. వీటిని తయారు చేసేందుకు స్థానిక మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఈ కేంద్రంలో తయారీ చేసిన నేప్‌కిన్స్‌ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ యూనిట్‌ను కొద్ది రోజులు డౌనూరు మహిళలు నిర్వహించి, తయారు చేసిన నేప్‌కిన్స్‌ అమ్మకానికి పెట్టారు. అదే సమయంలో కరోనా కారణంగా ఆశ్రమ పాఠశాలలు మూతపడ్డాయి. వాటిని ఐటీడీఏ తీసుకుని భద్రపరిచే చర్యలు చేపట్టలేదు. అలాగే మార్కెటింగ్‌ చేయించలేదు. ఈ తయారు చేసిన నేప్‌కిన్స్‌ను మార్కెటింగ్‌ చేయడంపై స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన లేకపోవడంతో వాటిని అలానే వదిలేశారు. ఈ విషయాన్ని వెలుగు అధికారులు కూడా పట్టించుకోలేదు. ఫలితంగా గడిచిన నాలుగేళ్లుగా మిషన్లు నిరుపయోగంగా దర్శనమిస్తుండగా.. ముడి సరకు పాడైపోతోంది. అలాగే వన్‌ధన్‌ వికాస కేంద్రాల పేరుతో ఏర్పాటు చేసిన యూనిట్‌లకు మిషన్లు కొన్న అధికారులు వీటి నిర్వహణకు, పెట్టుబడికి అవసరమైన నిధులు అందించకపోవడం, తయారీపై శిక్షణ ఇవ్వకపోవడం కారణంగా ఈ కేంద్రాలు పడకేశాయి. ఇందుకు కేటాయించిన భవనంపై రేకులు శిఽథిలమైన కోతులకు ఆవాసాలయ్యాయి. కోతులు భవనాలలోకి చొరపడి ఉన్న ముడి సరకు, తదితర సామగ్రిని ధ్వంసం చేశాయి. ఉన్నతాధికారులు స్పందించి మండలంలో నెలకొలిపిన శానిటరీ నేప్‌కిన్‌ తయారీ కేంద్రంతోపాటు వన్‌ధన్‌ వికాస కేంద్రాలను వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు.

చూస్తున్నారు.. వెళుతున్నారు..

తూబరి వీరభద్రమ్మ, అధ్యక్షురాలు, డౌనూరు డ్వాక్రా సంఘం

మహిళల ఆర్థికాభివృద్ధికి గత ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టలేదు. పెట్టుబడి నిధులు సమకూర్చకపోవడంతో ఈ కేంద్రం మూతపడింది. అప్పట్లో ఇచ్చిన మెటీరియల్‌, మిషన్లు పాడైపోయాయి. ప్రభుత్వం మారినందున ఈ కేంద్రాలను వినియోగంలోకి తీసుకువస్తే బాగుంటుంది.

Updated Date - Jan 11 , 2025 | 10:11 PM