ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతుబజార్‌ కలేనా!

ABN, Publish Date - Jan 07 , 2025 | 01:53 AM

నర్సీపట్నంలో రైతు బజార్‌ను వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు నిర్వీర్యం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

  • నర్సీపట్నంలో బోర్డుకే పరిమితం

  • ఎనిమిదేళ్ల క్రితం పెదబొడ్డేపల్లిలో ఏఎంసీ స్థలంలో ఏర్పాటు

  • డ్వాక్రా సంఘాలు, కొంతమంది రైతులకు దుకాణాలు కేటాయింపు

  • పట్టణానికి ఒకవైపున ఉండడంతో కూరగాయ రైతులు విముఖత

  • కరోనా సమయంలో ఇందిరా మార్కెట్‌ను అక్కడికి తరలించిన అధికారులు

  • అనంతరం దుకాణాలను అద్దెకు ఇచ్చిన వైనం

  • ఖాళీగా ఇందిరా మార్కెట్‌

  • పట్టణం నడిబొడ్డున ఉండడంతో ఇక్కడ రైతు బజార్‌ ఏర్పాటు చేయాలని పలువురు వినతి

నర్సీపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):

నర్సీపట్నంలో రైతు బజార్‌ను వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు నిర్వీర్యం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెదబొడ్డేపల్లిలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు స్థలంలో రైతు బజార్‌ బోర్డు పెట్టి కూరగాయల మార్కెట్‌ నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రాంతం పట్టణానికి ఒకవైపున వుంటుందని, అదే నర్సీపట్నం ఇందిరా మార్కెట్లో రైతు బజార్‌ ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో వుంటుందని కూరగాయ రైతులు, వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.

నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు పెదబొడ్డేపల్లిలో (కోటవురట్ల వెళ్లే రోడ్డు) 2.5 ఎకరాల స్థలం వుంది. ఇక్కడ 2009వ సంవత్సరంలో పండ్ల వ్యాపారుల కోసం 18 షాపులు నిర్మించారు. అయితే వ్యాపారులు ఎవరు రాకపోవడంతో దుకాణాలు నిరుపయోగంగా మారాయి. 2017లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అయ్యన్నపాత్రుడు చొరవతో రైతు బజార్‌ ఏర్పాటు కోసం రూ.20 లక్షలతో మరో 12 షాపులు నిర్మించి, విద్యుత్‌, నీటి సదుపాయాలు కల్పించారు. డ్వాక్రా సంఘాలకు, కొంత మంది రైతులకు దుకాణాలు కేటాయించారు. అయితే కూరగాయ పంటలు పండించే రైతుల్లో ఎక్కువ మంది గొలుగొండ, నాతవరం మండలాలకు చెందిన వారు కావడం, రైతుబజార్‌ వారికి చాలా దూరంలో వుండడంతో ఇక్కడికి రాలేదు. దీంతో దుకాణాలు నిరూపయోగంగా వున్నాయి. 2020వ సంవత్సరంలో కరోనా వైరస్‌ ప్రబలినప్పుడు నర్సీపట్నంలోని ఇందిరా మార్కెట్‌ను మూసేసి, వ్యాపారులను ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దకు, కొంత మందిని పెదబొడ్డేపల్లిలోని రైతు బజార్‌ తరలించారు. కరోనా వైరస్‌ తగ్గిపోయిన తరువాత రైతు బజార్‌లోని అన్ని దుకాణాలను కూరగాయల వ్యాపారులకు అద్దెకు ఇచ్చారు. దీంతో రైతు బజార్‌ కాస్తా కూరగాయల మార్కెట్‌గా మారిపోయింది. తరువాత పెదబొడ్డేపల్లిలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రైతుబజార్‌ను పునర్ధురిస్తామని వైసీపీ హయాంలో మార్కెటింగ్‌ శాఖ అధికారులు ప్రకటించారు. కానీ ఐదేళ్ల కాలంలో కార్యరూపం దాల్చలేదు.

రైతు బజార్‌కు ఇందిరా మార్కెట్‌ అనుకూలం

పెదబొడ్డేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డు పట్టణానికి పూర్తిగా తూర్పు వైపున వుంది. కూరగాయ పంటలను సాగు చేసే రైతుల్లో ఎక్కువ మంది గొలుగొండ, నాతవరం మండలాల్లో వున్నారు. ఈ మండలాలు పట్టణానికి నైరుతి, పశ్చిమ దిశల్లో వున్నాయి. దీంతో పెదబొడ్డేపల్లిలోని రైతు బజార్‌కు కూరగాయలు తీసుకువచ్చి అమ్ముకోవడానికి ఈ మండలాల రైతులు ఆసక్తి చూపడంలేదు. పైగా మునిసిపాలిటీలో కొద్ది వార్డులకు మాత్రమే పెదబొడ్డేపల్లి రైతు బజార్‌ అందుబాటులో వుంది. అందువల్ల ఇందిరా మార్కెట్‌లో రైతుబజార్‌ ఏర్పాటు చేస్తే రైతులకు, వినియోగదారులకు ఉపయోగకరంగా వుంటుంది. ఇందిరా మార్కెట్‌లో వందకుపైగా దుకాణాలు ఉన్నాయి. కరోనా సమయంలో చాలా మంది వ్యాపారులను డిగ్రీ కళాశాల రోడ్డులోకి తరలించగా, కరోనా తగ్గిన తరువాత వారు అక్కడే వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. దీంతో ఇందిరా మార్కెట్‌లో కిరాణా దుకాణాలు, ఒకటీ అరా కూరగాయల దుకాణాలు మాత్రమే వున్నాయి. మిగిలిన షాపులన్నీ ఖాళీగా పడివున్నాయి. ఇందిరా మార్కెట్‌లో రైతు బజార్‌ ఏర్పాటు చేస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jan 07 , 2025 | 01:53 AM