ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Advance ఒకరోజు ముందుగా..

ABN, Publish Date - Jan 01 , 2025 | 12:25 AM

A Day in Advance నూతన సంవత్సరం ప్రారంభానికి ఒకరోజు ముందుగానే జిల్లాలో లబ్ధిదారులకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు అందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి.. పింఛన్‌ సొమ్ము అందజేశారు.

గొట్టివలసలో పింఛన్లు అందిస్తున్న సచివాలయ సిబ్బంది

భాగస్వాములైన అధికారులు, ప్రజాప్రతినిధులు

పార్వతీపురం/సాలూరు/ సాలూరు రూరల్‌/గరుగుబిల్లి, డిసెంబరు 31 (ఆంరఽధజ్యోతి): నూతన సంవత్సరం ప్రారంభానికి ఒకరోజు ముందుగానే జిల్లాలో లబ్ధిదారులకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు అందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి.. పింఛన్‌ సొమ్ము అందజేశారు. ‘మన్యం’లో వివిధ రకాల పింఛన్లు 1,40,933 ఉండగా.. తొలిరోజు 1,32,704 మందికి సుమారు రూ.55.50 కోట్లు పింఛన్ల రూపంలో అందించారు. జిల్లాలో 107 మందికి కొత్తగా స్పౌజ్‌ పింఛన్లు అందించారు. కొన్నిచోట్ల సిగ్నల్‌ సమస్య ఉండడంతో గ్రామాల బయట పంపిణీ చేపట్టారు. మొత్తంగా 94 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయుడు తెలిపారు.

ఏడు కిలోమీటర్లు నడిచి, కొండలెక్కి ..

సుమారు ఏడు కిలోమీటర్లు నడిచి కొండలెక్కి సాలూరు మండలం ఏవోబీ పరిధి కొదమ పంచాయతీలో ఉన్న చింతామల, లొద్ద, బందపాయి గ్రామాలకు పంచాయతీ కార్యదర్శి అనిరుధ్‌ చేరుకున్నారు. చింతామల, లోద్ద, బందపాయిల్లో 98 మంది సామాజిక పింఛన్‌దారులకు మధ్యాహ్నంలోగా పింఛను సొమ్ము అందించారు. సువర్ణముఖీ నది దాటి సుల్లరి గ్రామానికి వీఏఏ తేజస్విని నడిచి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. గిరిశిఖరాల్లో ఉన్న కొదమ, పట్టుచెన్నారు, పగులుచెన్నారు, మారయ్యపాడు, కొఠియా గ్రూప్‌ గ్రామాలకు పంచాయతీ కార్యదర్శులు, మహిళా పోలీసు, వ్యవసాయ సహాయకులు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు తదితరులు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఒకరోజు ముందుగానే పింఛను డబ్బులు అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

అర్హులందరికీ పింఛన్లు: మంత్రి

సాలూరు పట్టణంలో 19,20 వార్డుల్లో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులందరికీ ఎన్టీఆర్‌ భరోసా కింద పింఛన్‌ అందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. తన కుమారుడు బింగు మహేష్‌కు కళ్లు కనిపించడం లేదని దివ్యాంగ పింఛన్‌ మంజూరు చేయాలని 19వ వార్డుకు చెందిన సత్యవతి కోరారు. ఒంటరి మహిళనైన తనను ఆదుకోవాలని వేడుకున్నారు. 15 ఏళ్లుగా మంచానికే పరిమితమైన పాలూరి పల్లవికి కేవలం దివ్యాంగ పింఛన్‌ మాత్రమే ఇస్తున్నారని, రూ. పదివేలు పింఛన్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు విన్నవించారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సదరంలో ఎందుకు అనర్హతగా చూపుతున్నారో తెలుసుకుంటానని, దీనిపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడుతానని మంత్రి తెలిపారు. ఆమె వెంట మున్సిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణ, కౌన్సిలర్లు హర్షవర్దన్‌, శైలజ, టీడీపీ నాయకులు తిరుపతిరావు, అశోక్‌, చంద్ర, చిరంజీవి, నటరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 12:25 AM