నందివానివలసలో ఏనుగుల గుంపు
ABN , Publish Date - Feb 09 , 2025 | 11:17 PM
ఏనుగుల గుంపు ఆదివారం నందివానివలస సమీపంలోని తామర చెరువు వద్ద ప్రత్యక్షమైంది. కురుపాం నియోజకవర్గం పరిధిలోని కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం మండలాల్లో గత కొద్ది రోజులుగా ఏనుగులు సంచరిస్తున్నాయి.

గరుగుబిల్లి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఏనుగుల గుంపు ఆదివారం నందివానివలస సమీపంలోని తామర చెరువు వద్ద ప్రత్యక్షమైంది. కురుపాం నియోజకవర్గం పరిధిలోని కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం మండలాల్లో గత కొద్ది రోజులుగా ఏనుగులు సంచరిస్తున్నాయి. శనివారం జియ్యమ్మవలస మండలం సింగనాపురం, కుదమ గ్రామాల్లో సంచరించాయి. ఆదివారం గతంలో వచ్చిన తామర చెరువు ప్రాంతానికి మళ్లీ చేరుకున్నాయి. గత నాలుగేళ్లుగా తిరిగిన ప్రాంతాల్లోనే తిరుగుతూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం నందివానివలసలో ఉన్న గజరాజుల గుంపు ఏ సమయంలో ప్రధాన రహదారులతో పాటు గ్రామాల్లోకి వస్తాయోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో అధికంగా సుంకి ప్రాంతంలో తిష్ఠ వేసి పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి. అటవీ అధికారులు స్పందించి ఏనుగులు తమ గ్రామాల వైపు రాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.