Bengaluru: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. విషయం ఏంటంటే..
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:39 PM
ప్రముఖ హీరోయిన్ రష్మికా మందన్నపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మహిళా కమిషన్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఇప్పుడు అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశమైంది. ఇందుకు సంభంధించిన వివరాలిలా ఉన్నాయి.

బెంగళూరు: ప్రముఖ నటి రష్మికా మందన్న(Actress Rashmika Mandanna)ను దూషించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవిగణిగ(Congress MLA Raviganiga)పై సుమోటోగా కేసు నమోదు చేయించాలని, నటికి సంపూర్ణ రక్షణ కల్పించాలంటూ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కొడుగు జిల్లాలో నివసించే కొడవ సమాజానికి చెందిన కొడవ నేషనల్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్‌యు నాచప్ప ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కేంద్రహోంమత్రి అమిత్‌షాకు, రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్‌లకు వినతుల ద్వారా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తను కూడా చదవండి: Divya: నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..
తాజాగా మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కమిషన్ చర్యలకు సిద్దమైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే రవిగణిగకు సమస్య ఎదురైనట్లు అవుతుంది. రెండువారాల కిందట ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టవల్ వేదికగా డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar) సినిమారంగానికి చెందిన వారిలో కొందరు అతిగా ఉన్నారని వారికి నట్లుబోల్టులు ఎలా బిగించాలో తెలుసని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు.
డీసీఎం డీకే శివకుమార్‌కు మద్దతుగా మండ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే రవిగణిగ(Congress MLA Raviganiga) స్పందిస్తూ బెంగళూరులో చలనచిత్రోత్సవాలకు ఏడాది కిందట రష్మికామందన్నను ఆహ్వానిస్తే అవమానించేలా మాట్లాడారని ఇటువంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. దీంతో నటి రష్మికను మానసికంగా ఇబ్బంది కలిగించారంటూ కొడవ సమాజం తరుపున మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
జర్నలిస్టులుగా అసభ్య పదజాలం వాడొచ్చా..
Read Latest Telangana News and National News