అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:35 AM
కురుపాం నియోజకవర్గంలో తాను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు.

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): కురుపాం నియోజకవర్గంలో తాను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. గుమ్మలక్ష్మీపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె ఆదివారం విలేకర్లతో మాట్లా డారు. ఎల్విన్‌పేటలో ఓ గిరిజనేత్రుడు తన మద్దతుతో భవన నిర్మాణం చేపడుతున్నాడని తప్పుడు ఆరోపణ చేయడం సరికాదన్నారు. ‘మీరు పదేళ్లలో వేయని రోడ్లు.. మేము 11 నెలల్లో వేసి చూపించామని, ఇప్పుడు వచ్చిన పను లను కాంట్రాక్టర్లు, నాయకులు, కర్యకర్తలు చేస్తుంటే.. మీ హయాంలో మీ మరిది మాత్రమే చేశార’ని ఆమె ఆరోపించారు. తనకు దోచకోవడం తెలియదని.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పాలన మాత్రమే తెలసునని ప్రభుత్వ విప్ స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉన్న గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో ప్రెస్‌మీట్లు పెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్‌చార్జి కడ్రక మల్లేశ్వరరావు, కురుపాం మార్కెట్ కమిటీ చైర్మన్ కడ్రక కళావతి, టీడీపీ నాయకుడు కోలా రంజిత్‌కుమార్, పార్టీ మండల కన్వీనర్లు పాడి సుధ, శేఖర్ ప్రాతుడు, అక్కేన మధు, బీజేపీ నిమ్మక సింహాచలం తదితరులు పాల్గొన్నారు.