ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Weight is Essential వయసుకు తగ్గ బరువు ఉండాలి

ABN, Publish Date - Jan 05 , 2025 | 12:11 AM

Age-Appropriate Weight is Essential అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు వయసుకు తగిన బరువు, ఎత్తు ఉండాలని లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ సీడీపీవోలను హెచ్చరించారు. ప్రతి కేంద్రంలో శతశాతం హాజరు ఉండాలన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

సీడీపీవోలకు కలెక్టర్‌ హెచ్చరిక

పార్వతీపురం, జనవరి 4(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు వయసుకు తగిన బరువు, ఎత్తు ఉండాలని లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ సీడీపీవోలను హెచ్చరించారు. ప్రతి కేంద్రంలో శతశాతం హాజరు ఉండాలన్నారు. భోజనం సమయానికి పిల్లలు కేంద్రానికి వచ్చేలా చూడాలని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికా రులతో మాట్లాడుతూ.. ఏడాది దాటిన పిల్లలకు ప్రతి ఆరు నెలలకొకసారి ఆల్‌బెండాజోల్‌ మాత్రలు ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిశుభ్ర వాతావరణం ఉండాలని తెలిపారు. బాగా పనిచేసిన అంగన్‌వాడీ వర్కర్ల పేర్లను గణతంత్ర దినోత్సవ అవార్డులకు ప్రతిపాదించాలని ఐసీడీఎస్‌ పీవోను ఆదేశించారు. బాల్య వివాహాల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్‌ పథక సంచాలకులు టి.కనకమహాలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహన్‌రావు, జిల్లా శిశు సంరక్షణ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 12:11 AM