పండుగకు వచ్చి.. బస్సు ఢీకొని..
ABN, Publish Date - Jan 16 , 2025 | 12:35 AM
సంక్రాంతి పండుగకు వచ్చిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో బస్సు ఢీకొనడంతో మంగళ వారం సాయంత్రం దుర్మరణం పాలయ్యాడు.
సాలూరు రూరల్, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగకు వచ్చిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో బస్సు ఢీకొనడంతో మంగళ వారం సాయంత్రం దుర్మరణం పాలయ్యాడు. దీంతో ఆ కుటుంబంలో విషాధం నెలకొంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. సాలూరు లెప్రసీ కాలనీకి చె దిన బలగ శ్యాంసన్ (19 ) సబ్బవరం మండలంలోని పైడివర అగ్రహారంలో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సంక్రాంతి పురస్కరించుకుని యాజమాని వి ధులకు సెలవులు ఇవ్వడంతో ఆదివారం సాలూరు వచ్చాడు. తన బంధువులు బాగువలస ఉండడంతో వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నాడు. ఆ సమ యంలో చంద్రంపేట సబ్‌స్టేషన్ సమీపంలో మలుపు వద్ద దుగ్గేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. దీంతో శ్యాంసన్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సాలూరు రూరల్ ఎస్‌ఐ పి.నర్సింహమూర్తి కేసు నమోదు చేశారు.
మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుతాడనగా...
బాగువలస నుంచి వస్తున్న శ్యాంసన్ మరో పది నిమిషాల్లో ఇంటికి చేరు కోనున్నాడు. ఈలోగా బస్సు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. చిన్నతనంలోనే తండ్రి రామకృష్ణ మృతి చెందాడు. తల్లి జగదీశ్వరి పనులు చేసి పెంచి పెద్ద చేసింది. చేతికి అందొచ్చిన కుమారుడు మృతి చెందడంతో ఆమె రోదిస్తోంది.
Updated Date - Jan 16 , 2025 | 12:35 AM