ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AMCs ఏఎంసీలకు చైర్మన్లు

ABN, Publish Date - Mar 29 , 2025 | 12:03 AM

Chairmen Appointed for AMCs జిల్లాలో సాలూరు, కురుపాం, పాలకొండ వ్యవసాయ మార్కెట్‌ కమిటీల(ఏఎంసీ)కు చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జాబితాను విడుదల చేసింది.

మంత్రి సంధ్యారాణిని కలిసిన సాలూరు ఏఎంసీ చైర్మన్‌ సూర్యనారాయణ

పేర్లు ప్రకటించిన ప్రభుత్వం

పార్వతీపురం, మార్చి 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాలూరు, కురుపాం, పాలకొండ వ్యవసాయ మార్కెట్‌ కమిటీల(ఏఎంసీ)కు చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జాబితాను విడుదల చేసింది. సాలూరు ఏఎంసీ చైర్మన్‌గా పాచిపెంట మండలం మాతుమూరు మాజీ సర్పంచ్‌, టీడీపీ కార్యదర్శి ఎం.సూర్యనారాయణ నియామకమయ్యారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందిన ఆయన టీడీపీ బలోపేతానికి విశేష సేవలందిస్తున్నారు. కాగా తనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబునాయుడు , మంత్రి సంధ్యారాణికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సాలూరుకు చేరుకున్న సూర్యనారాయణను మంత్రి అభినందించారు. కురుపాం ఏంఎసీ చైర్‌పర్సన్‌గా నియామకమైన కడ్రక కళావతి గుమ్మలక్ష్మీపురం మండలం లక్కగూడ సర్పంచ్‌గా, ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి ఆమెకు స్వీట్‌ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. పాలకొండ ఏఎంసీ చైర్‌పర్సన్‌గాసీతంపేట మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన బిడ్డిక సంధ్యారాణి నియామకమయ్యారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సిఫారసుల మేరకు ఆమెఈ పదవి లభించింది. త్వరలోనే వారు బాధ్యతలను స్వీకరించనున్నారు. కాగా పార్వతీపురం ఏఎంసీకి చైర్మన్‌గా ఇంకా ఎవర్నీ ఎంపిక చేయలేదు. జిల్లాలో నాలుగు ఏఎంసీలకు వైస్‌ చైర్మన్లు, డైరెక్టర్ల పేర్లు ఖరారు కావాల్సి ఉంది.

Updated Date - Mar 29 , 2025 | 12:03 AM