పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:05 AM
పెదగొత్తిలి పంచాయతీ పరిధి లోని కోలిసగూడ, ఆరికకురిడి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల ప్రహరీలను ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మంగళవారం ప్రారంభించారు.

కురుపాం రూరల్, ఏప్రిల్ 15(ఆంధ్ర జ్యోతి): పెదగొత్తిలి పంచాయతీ పరిధి లోని కోలిసగూడ, ఆరికకురిడి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలల ప్రహరీలను ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మంగళవారం ప్రారంభించారు. ఈసంద ర్భంగా ఆమె మాట్లాడుతూ పేద విద్యా ర్థులకు ఉన్నత విద్యను అందించే దిశలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్ర మంలో ఎంపీడీవో జె.ఉమామహేశ్వరి, టీడీపీ మండల కన్వీనరు కలిశెట్టి కొండయ్య, పార్టీ అధికార ప్రతినిధి కోలా రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.