కొండగంగుబూడి రోడ్డులో రైతుల నిరసన

ABN, Publish Date - Mar 23 , 2025 | 12:08 AM

మండలంలోని బొద్దాం పొలాల్లో మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను చెక్‌పోస్టు సిబ్బంది, మైన్స్‌ ఆర్‌ఐ శీరిష అడ్డుకున్నారు. దీంతో రైతులు,ట్రాక్టర్ల యజమానులు కొండగంగుబూడి రహదారిలో టాక్టర్లు, యంత్రాలతో నిరసన తెలిపారు. రైతులు పొలాల్లో నుంచి మట్టి తరలిస్తుంటే ట్రా క్టర్లు, యంత్రాలనుఅడ్డుకోవడం దారుణమని బొద్దాం గ్రామానికి చెందిన రైతులు, ట్రాక్టర్ల యజమానులు వాపోయారు.

  కొండగంగుబూడి రోడ్డులో రైతుల నిరసన
-రైతులు,ట్రాక్టర్‌ యజమానులతో మాట్లాడుతున్న వల్లంపూడి ఎస్‌ఐ దేవి

వేపాడ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బొద్దాం పొలాల్లో మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను చెక్‌పోస్టు సిబ్బంది, మైన్స్‌ ఆర్‌ఐ శీరిష అడ్డుకున్నారు. దీంతో రైతులు,ట్రాక్టర్ల యజమానులు కొండగంగుబూడి రహదారిలో టాక్టర్లు, యంత్రాలతో నిరసన తెలిపారు. రైతులు పొలాల్లో నుంచి మట్టి తరలిస్తుంటే ట్రా క్టర్లు, యంత్రాలనుఅడ్డుకోవడం దారుణమని బొద్దాం గ్రామానికి చెందిన రైతులు, ట్రాక్టర్ల యజమానులు వాపోయారు. ఈ సందర్భంగా రైతులు మాట్లా డుతూ ఇక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటుకు అనుమతులు ఇచ్చి రైతులు,సామాన్య ప్రజల నెత్తిన భారం మోపడం అన్యాయమన్నారు.చెక్‌పోస్టు యాజమాన్యం ఫిర్యాదు మేరకు సంటన స్థలానికి చేరుకున్న వల్లంపూడి ఎస్‌ఐ బొడ్డు దేవి ట్రాక్టర్‌ యజ మానులు, రైతులతో మాట్లాడారు. అనంతరం చెక్‌పోస్టు యాజమాన్య ప్రతిని ధులు, మైన్స్‌ అధికారులతో మాట్లాడారు.

Updated Date - Mar 23 , 2025 | 12:08 AM