ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

First Phase మొదటి విడత పూర్తి

ABN, Publish Date - Jan 07 , 2025 | 11:32 PM

First Phase Completed జిల్లాలో నకిలీ దివ్యాంగుల పింఛన్ల ఏరివేతకు ప్రత్యేక వైద్య బృందం చేపట్టిన మొదటి విడత తనిఖీలు ముగిశాయి. ఈ నెల 6, 7 తేదీల్లో 14 మండలాల పరిధిలో వారు పర్యటించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 8 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల సారధ్యంలో 28 మంది వైద్యుల బృందం రెండు రోజుల పాటు పూర్తిస్థాయిలో పరిశీలన చేశారు.

పెద్దూరులో మంచంపై ఉన్న దివ్యాంగుని వివరాలు సేకరిస్తున్న వైద్య బృందం

నకిలీల ఏరివేతకు నివేదికలు సిద్ధం

గరుగుబిల్లి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నకిలీ దివ్యాంగుల పింఛన్ల ఏరివేతకు ప్రత్యేక వైద్య బృందం చేపట్టిన మొదటి విడత తనిఖీలు ముగిశాయి. ఈ నెల 6, 7 తేదీల్లో 14 మండలాల పరిధిలో వారు పర్యటించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 8 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల సారధ్యంలో 28 మంది వైద్యుల బృందం రెండు రోజుల పాటు పూర్తిస్థాయిలో పరిశీలన చేశారు. నాలుగు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. 92 మంది దివ్యాంగుల గృహాలకు వెళ్లి వారి పరిస్థితులను పరిశీలించారు. రూ.15 వేలు దివ్యాంగ పింఛన్‌ పొందుతున్న మంచాలపై లేవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, డయాలసిస్‌, పెరాలసిస్‌ వంటి సమస్యలతో సతమతమవుతున్న వారి ధ్రువప్రతాలు నిశితంగా పరిశీలించి నివేదికలు రూపొందించారు. వాటిని త్వరలో ప్రభుత్వానికి అందజేయనున్నారు. కాగా మంగళవారం గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర, రావుపల్లి, పెద్దూరు, దళాయివలస, సంతోషపురం పంచాయతీల్లో విచారణ చేపట్టారు. ఈ తనిఖీల్లో వైద్యులు రవికుమార్‌, నరసింగరావు, సాగర్‌వర్మ, సంతోషకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రెండో విడతలో..

రెండో విడతలో రూ. 6 వేలు పొందుతున్న దివ్యాంగుల పింఛన్లను తనిఖీ చేయనున్నారు. నకిలీలను గుర్తించేందుకు కొద్దిరోజుల్లో ప్రభుత్వం ప్రత్యేక యాప్‌లను సచివాలయాల సిబ్బందికి అందించనుంది. ప్రస్తుతం జిల్లాలో 1,42,393 పింఛన్లను పరిశీలించిన అనంతరం నూతన పింఛన్లు మంజూరు చేయనున్నారనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు సచివాలయాల పరిధిలో అర్హుల జాబితా సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ప్రకటన కోసం వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. నిబంధనల మేరకు అర్హత ఉన్నవారికి పింఛన్‌ అందించాలని కోరతున్నారు.

Updated Date - Jan 07 , 2025 | 11:32 PM