ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

'Palavalasa' Passes Away మాజీ ఎంపీ ‘పాలవలస’ కన్నుమూత

ABN, Publish Date - Jan 14 , 2025 | 12:23 AM

Former MP 'Palavalasa' Passes Away గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ రాజ్యసభ సభ్యుడు పాలవలస రాజశేఖరం (80) సోమవారం రాత్రి మృతి కన్నుమూశారు. శ్రీకాకుళంలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్‌గా పనిచేశారు.

పాలవలస రాజశేఖరం (ఫైల్‌)

2011 నుంచి వైసీపీలో..

పాలకొండ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ రాజ్యసభ సభ్యుడు పాలవలస రాజశేఖరం (80) సోమవారం రాత్రి మృతి కన్నుమూశారు. శ్రీకాకుళంలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన రాజకీయ ప్రస్థానమంతా కాంగ్రెస్‌ పార్టీలోనే సాగింది. 2011లో వైసీపీలో చేరారు. కాగా ఆయన సతీమణి ఇందుమతి రేగిడి జడ్పీటీసీగా ఉన్నారు. కుమారుడు విక్రాంత్‌ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కోడలు గౌరీపార్వతి పాలకొండ జడ్పీటీసీగా ఉన్నారు. కుమార్తె రెడ్డి శాంతి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాతపట్నం ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజశేఖరం స్వగ్రామం పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం నీలానగరం. ఆయన తండ్రి పాలవలస సంగంనాయుడు 1962-67 మధ్య ఉనుకూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజశేఖరం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఆనర్స్‌ చేశారు. 1970-74లో నీలానగర సర్పంచ్‌గా పనిచేశారు. శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్‌గా 1974 నుంచి 1976 వరకు పనిచేశారు. 1976లో రాజ్యసభ సభ్యునిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 1992-94 మధ్యకాలంలో డీసీసీబీ అధ్యక్షునిగా పనిచేశారు. 1994లో ఉణుకూరు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి కిమిడి కళావెంకటరావుపై గెలుపొందారు. 1994 నుంచి 1999 వరకు శాసన సభ్యునిగా ఉన్నారు. 2006 నుంచి 2011 వరకు శ్రీకాకుళం జడ్పీ అధ్యక్షునిగా సేవలందించారు. రాజశేఖరం మృతికి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 14 , 2025 | 12:23 AM