Godadevi Kalyanam :అంగరంగ వైభవంగా గోదాదేవి కల్యాణం
ABN, Publish Date - Jan 14 , 2025 | 12:05 AM
ఉమ్మడి జిల్లాలోని రామతీర్ధం రామస్వామి, గరుగుబిల్లి మండలంలోని తోటపల్లిలోగల Godadevi Kalyanam Godadevi Kalyanam ::వేంకటేశ్వరస్వామి,కోదండరామస్వామి దేవస్థానాలతోపాటు పలుచోట్ల గోదాదేవి కల్యాణం అంగరంగ వైభవంగా సోమవారం నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా ధనుర్మాసోత్సవాలు ముగిశాయి.
ఉమ్మడి జిల్లాలోని రామతీర్ధం రామస్వామి, గరుగుబిల్లి మండలంలోని తోటపల్లిలోగల వేంకటేశ్వరస్వామి,కోదండరామస్వామి దేవస్థానాలతోపాటు పలుచోట్ల గోదాదేవి కల్యాణం అంగరంగ వైభవంగా సోమవారం నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా ధనుర్మాసోత్సవాలు ముగిశాయి.
ఫనెల్లిమర్ల, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రామతీర్ధం రామస్వామి వారి దేవస్థానంలో గోదాదేవి కళ్యాణోత్సవాన్ని దేవస్థానం అర్చకులు నిర్వహించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని 30 రోజులుగా గోదాదేవి తన మనసులో కృష్ణభగవానుడుని కొలుస్తూ రోజుకో పాశురాన్ని గానం చేస్తూ తిరుప్పావై వ్రతాన్ని చేసిందని, భోగి నాడు గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మ లో వివాహం చేసుకుని లీనమవుతుందని ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి సాయిరామాచార్యులు వివరించారు. ఈక్రమంలో సోమవారం ఉదయం ప్రాతఃకాలార్చన, తిరుప్పావైసేవా కాలం, బాలభోగం నిర్వహిం చారు. అనంతరం గోదాదేవి అమ్మవారిని ఊరేగించి, ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో స్నానం చేయించారు. గోదాదేవి అమ్మవారిని పెండ్లికుమార్తెగా అలంకరించి శ్రీకృష్ణ పరమాత్మతో కల్యాణోత్సవం నిర్వహించారు. తర్వాత యాగశాలలో సుందరకాండహవనం, సుదర్శన అష్టకం హ వనం చేశారు. కార్యక్రమాన్ని ఆలయ ఈవో వై.శ్రీనివాసరావు పర్యవేక్షించగా, అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, ఖండవిల్లి కిరణ్‌కుమార్, గొడవర్తి నరసింహాచార్యులు, పవన్‌కుమార్, పాణంగిపల్లి ప్రసాద్ తదితరులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు
ఫగరుగుబిల్లి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి):తోటపల్లి వేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి దేవస్థానాల్లో ధనుర్మాస ఉత్సవాలు ముగిశాయి. ఇక్కడ గతనెల 16 నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సోమవారం ఈవో వీవీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో గోదాదేవి కల్యాణాన్ని ప్రధాన అర్చకులు వీవీ అప్పలాచార్యులు నిర్వహించారు. స్వామివారికి మొక్కు లను చెల్లించారు. తలనీలాలను అర్పించారు.
ఫ శృంగవరపుకోట రూరల్, జనవరి13 (ఆంధ్రజ్యోతి):కొట్టాం గోస్తనీ నదితీరంలో గోదాదేవికల్యాణం ధర్మకర్తలు సేనాపతిచంద్రరావు,బాలసన్యా సమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. గోస్తనీ తీరం కొండపై కొలువుదీరిన విష్ణు ఆలయం నుంచి అమ్మవారిని ఉరేగింపుగా తీసుకొచ్చారు.
Updated Date - Jan 14 , 2025 | 12:05 AM