ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాలి

ABN, Publish Date - Feb 09 , 2025 | 11:28 PM

ప్రభుత్వ పాఠశాల విద్యారంగాన్ని, పాఠశాలలను రక్షిం చుకో వాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌ జేసీ రాజు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాలి

బొబ్బిలి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాల విద్యారంగాన్ని, పాఠశాలలను రక్షిం చుకో వాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌ జేసీ రాజు పిలుపునిచ్చారు. ఆ బాధ్యత మనందరిపై ఉందని, ఇందుకోసం తల్లి దండ్రుల సహకారంతో పో రాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఆదివారం బొబ్బిలి ఎన్‌జీవో హోంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో-117 రద్దుకు సంబంధించి ప్రభుత్వం అస్పష్టమైన వైఖరిని అవలంబిస్తోందని ఆరో పించారు. జీవో- 117 రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో మోడల్‌, ఫౌండేషన్‌ స్కూల్స్‌గానో మార్చుతామనడం సరికాదన్నారు. ఫౌండేషన్‌ పాఠశాల వ్యవస్థను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. 12 వ వేతన సంఘాన్ని నియమించాలని డిమాండ్‌ చేశారు.సమావేశంలో జోగినాయుడు, ప్రవీణ్‌కుమార్‌,నాగేశ్వరరావు, శ్రీను, ఎల్లయ్య, దర్శనం పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2025 | 11:28 PM