పల్లె పండగలా రహదారుల ప్రారంభోత్సవం
ABN, Publish Date - Jan 06 , 2025 | 12:10 AM
నియోజక వర్గంలో ఈనెల 6, 7 తేదీల్లో చేపట్టనున్న వంద రోడ్ల ప్రారంభోత్సవానికి ప్రజలు, కార్యకర్తలు, నాయ కులు హాజరు కావాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు.
సాలూరు, జనవరి 5(ఆంధ్రజ్యోతి): నియోజక వర్గంలో ఈనెల 6, 7 తేదీల్లో చేపట్టనున్న వంద రోడ్ల ప్రారంభోత్సవానికి ప్రజలు, కార్యకర్తలు, నాయ కులు హాజరు కావాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. ఈ మేరకు ఆదివారం సాలూరులోని తన నివాసంలో ఆమె స్థానిక విలేకర్లతో సమావేశం నిర్వహించారు. ఈసంద ర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో పల్లె పండగలా వంద రహదారుల నిర్మాణం చేయబోతున్నామని తెలిపారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మక్కువ మండలంలో కాశీపట్నం సీసీ రోడ్డు తోపాటు 35 సీసీ రోడ్లు ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం సాలూరు మండలంలో తోణాం పంచాయతీతో పాటు మండలంలో 18 సీసీ రోడ్లు ప్రారంభిస్తామన్నారు. మంగళవారం పాచిపెంట మండలం మంచాడవలస గ్రామంతో పాటు మండలంలో 27 సీసీ రోడ్లు ప్రారంభిస్తున్నామని, అదే రోజు మధ్యాహ్నం మెంటాడ మండలంలో పెదమేడపల్లి తోపాటు 22 సీసీ రోడ్లు ప్రారంభిస్తామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, పరమేష్, గుళ్ల వేణు, పిన్నింటి ప్రసాద్‌బాబు, యుగంధర్ తోపాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Updated Date - Jan 06 , 2025 | 12:10 AM