శంబర పండగకు మంత్రికి ఆహ్వానం
ABN, Publish Date - Jan 04 , 2025 | 11:43 PM
శంబర పోల మాంబ సిరిమాను పండగకు విచ్చేయాలని కోరుతూ జిల్లా దేవదాయ శాఖ అధికారి రాజారావు, ఆలయ దేవదాయ శాఖ అధికారి సూర్యనారాయణ.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి మొదటి ఆహ్వాన పత్రాన్ని శనివారం అందజేశారు.
సాలూరు, జనవరి 4(ఆంధ్రజ్యోతి): శంబర పోల మాంబ సిరిమాను పండగకు విచ్చేయాలని కోరుతూ జిల్లా దేవదాయ శాఖ అధికారి రాజారావు, ఆలయ దేవదాయ శాఖ అధికారి సూర్యనారాయణ.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి మొదటి ఆహ్వాన పత్రాన్ని శనివారం అందజేశారు. శంబర పండగను రాష్ట్ర పండగగా ప్రకటించడంతో ప్రభుత్వం తరపున అమ్మవారి కి పట్టు వస్త్రాలు సమర్పించాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
Updated Date - Jan 04 , 2025 | 11:43 PM