కలిసికట్టుగా అభివృద్ధికి కృషి చేద్దాం
ABN, Publish Date - Jan 01 , 2025 | 12:13 AM
కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఆశావహ మండలం భామినిని అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఐటీడీఏ పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.
భామిని, డిసెంబరు 31 (ఆంరఽధజ్యోతి): కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఆశావహ మండలం భామినిని అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఐటీడీఏ పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో శాఖల వారీగా సమీక్షించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భామిని మండలం అభివృద్ధికి రూ.1.5 కోట్లు ప్రోత్సాహం ప్రకటించడం గర్వకారణమన్నారు. ఐటీడీఏ పీవో మాట్లాడుతూ మండల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు ఈనెల 5వ తేదీలోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎనీమియా రోగ నివారణకు క్షేత్రస్థాయిలో ఉన్న మహిళా పోలీసులు కృష చేయాలన్నారు. ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబు, డీడీ అన్నదొర, తహసీల్దార్ అప్పారావు, ఎంపీడీవో చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 01 , 2025 | 12:13 AM