financial support మత్స్యకారులకు మరింత ‘భరోసా’
ABN, Publish Date - Jan 02 , 2025 | 11:26 PM
More 'assurance' for fishermen వేట నిషేధసమయంలో చెల్లించే మత్స్యకార భరోసాను రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచుతూ మంత్రివర్గం గురువారం నిర్ణయం తీసుకుంది. దీనిపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో తీర ప్రాంత మండలాలైన భోగాపురం, పూసపాటిరేగలో సుమారు 5వేల మంది చేపల వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారు
మత్స్యకారులకు
మరింత ‘భరోసా’
సాయం రూ.20 వేలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం
భోగాపురం, జనవరి2(ఆంధ్రజ్యోతి): వేట నిషేధసమయంలో చెల్లించే మత్స్యకార భరోసాను రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచుతూ మంత్రివర్గం గురువారం నిర్ణయం తీసుకుంది. దీనిపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో తీర ప్రాంత మండలాలైన భోగాపురం, పూసపాటిరేగలో సుమారు 5వేల మంది చేపల వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతీ ఏడాది ఏప్రిల్ 14వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు సుమారు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై నిషేధం ఉంటుంది. ఆ సమయంలో మత్స్యకారులు ఇంటికే పరిమితమవుతారు. ఆ రెండు నెలల కాలానికి మత్స్యకారులకు గత ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద రూ.10 వేలు అందించేది. అదికూడా అర కొరగానే ఇచ్చేది. కూటమి నాయకులు ఎన్నికల ముందు మత్స్యకార భరోసా రూ.20వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ మేరకు రూ.20 వేలకు పెంచుతూ మంత్రి వర్గం తాజాగా నిర్ణయం తీసుకుంది.
- ఆ రెండు మండలాల్లో 419 సాంప్రదాయ పడవలు, 722 ఇంజన్ పడవలు ఉన్నాయి. సుమారు 4వేలు మందికి పైగా మత్స్యకార భరోసా పథకానికి అర్హులు ఉండే అవకాశం ఉంది. ఇటీవల అధికారులు 3798 మందినే అర్హులుగా గుర్తించి వారి బ్యాంకు ఖాతాలు, ఫోన్ నెంబర్లు, ఆధార్ వివరాలు అప్‌లోడ్ చేశారు.
Updated Date - Jan 02 , 2025 | 11:26 PM