నిర్వహణ లేక.. మరమ్మతులు చేయక
ABN, Publish Date - Jan 14 , 2025 | 12:08 AM
మండలంలోని పలు వంతెనలు నిర్వహణ లేక ప్రమా దకరంగా మారాయి. ప్రధానంగా వంతెనల వద్ద రెయిలింగ్, రక్షణ గోడలు పాడయ్యాయి. దీంతో ఏమరపాటున ఉన్న సమయంలో, చీకటిపడిన తర్వాత రాకపోకలు సాగించేవాహనాలు ప్రమదానికి గురయ్యే అవకాశముంది
సంతకవిటి,జనవరి 13(ఆంధ్రజ్యోతి):మండలంలోని పలు వంతెనలు నిర్వహణ లేక ప్రమా దకరంగా మారాయి. ప్రధానంగా వంతెనల వద్ద రెయిలింగ్, రక్షణ గోడలు పాడయ్యాయి. దీంతో ఏమరపాటున ఉన్న సమయంలో, చీకటిపడిన తర్వాత రాకపోకలు సాగించేవాహనాలు ప్రమదానికి గురయ్యే అవకాశముంది. ఈనేపథ్యంలో ఆయా చోట్ల హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటుచేయలేదు. వంతెనకు ఇరువైపుల ఏర్పాటు చేసిన గోడలు పూర్తిగా పాడవడంతో వేగంగా వచ్చే వాహనాలు కాలువల్లోకి దూసుకువెళ్లే ప్రమాదముందని పలువురు వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు. వంతెనలు నిర్మించి మూడు దశాబ్దాలు దాటతున్నా కనీ స మరమ్మతులు లేకపోవడంతో ఏ క్షణంలో కూలిపోతాయోనని భీతిల్లుతున్నారు. సంతకవిటి-హోంజరాం ప్రధానరహదారిలో వాసుదేవపట్నం వద్ద నారాయణపురం కుడికాలువపై ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకుచేరింది. వంతెనపై భాగంలో రక్షణగోడ కూడాలేదు. దీంతో పైభాగంలో రక్షణ గోడలేదు. ఇదే ప్రాంతంలో ప్రమాదకరంగా రోడ్డు మలుపు ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనచోదకులు ఆందోళనకు గురవుతున్నారు.మల్లయ్యపేట వద్ద నారాయణపురం కుడికాలువపై ఉన్న బ్రిడ్జి, రామారాయపురం వద్ద సాయన్నచానల్‌పై ఉన్న బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మతులకైనా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
:
Updated Date - Jan 14 , 2025 | 12:08 AM