Elephants బాబోయ్ ఏనుగులు
ABN, First Publish Date - 2025-04-08T23:24:15+05:30
"Oh No! Elephants జియ్యమ్మవలస మండలం ఎరుకులపేట సమీపంలో ప్రధాన రహదారిపై మంగళవారం గజరాజులు సంచరించాయి. దీంతో స్థానికులు, వాహనదారులు బెంబేలెత్తిపోయారు. అవి ఎవరిపై దాడి చేస్తాయోనని ఆందోళన చెందారు. అయితే కాసేపటి తర్వాత అవి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లిపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
జియ్యమ్మవలస, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస మండలం ఎరుకులపేట సమీపంలో ప్రధాన రహదారిపై మంగళవారం గజరాజులు సంచరించాయి. దీంతో స్థానికులు, వాహనదారులు బెంబేలెత్తిపోయారు. అవి ఎవరిపై దాడి చేస్తాయోనని ఆందోళన చెందారు. అయితే కాసేపటి తర్వాత అవి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లిపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా గజరాజులు గత పది రోజులుగా బిత్రపాడు, కన్నపుదొరవలస, పెదమేరంగి, గవరమ్మపేట పంచా యతీల్లోనే హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం అవి వెంకటరాజపురం-ఎరుకులపేట ఎరుకులపేట గ్రామాల మధ్య తిష్ఠ వేశాయి. అయితే వాటి కదలికలను కురుపాం ఫారెస్ట్ రేంజర్ గంగరాజు ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది, ట్రాకర్లు పరిశీలిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా ఎవరూ బయటకు రావొద్దని ప్రజలకు సూచిస్తున్నారు. గున్న ఏనుగు సంరక్షణపై దృష్టి సారించిన గజరాజులు కొంచెం కోపంతో ఉన్నట్లు రేంజర్ గంగరాజు తెలిపారు.
Updated Date - 2025-04-08T23:24:16+05:30 IST