రైలు ఢీకొని వృద్ధుడికి గాయాలు

ABN, Publish Date - Feb 09 , 2025 | 11:30 PM

బొబ్బిలి రైల్వే ప్లాట్‌ఫారం శివారున ఆది వారం పట్టాలు దాటుతుండగా సమతా ఎక్‌ప్రెస్‌ ఢీకొన్న ఘటనలో పక్కి గ్రా మానికి చెందిన వృద్ధుడు బంకురు రాము గాయపడ్డాడు.

 రైలు ఢీకొని వృద్ధుడికి గాయాలు

బొబ్బిలి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి రైల్వే ప్లాట్‌ఫారం శివారున ఆది వారం పట్టాలు దాటుతుండగా సమతా ఎక్‌ప్రెస్‌ ఢీకొన్న ఘటనలో పక్కి గ్రా మానికి చెందిన వృద్ధుడు బంకురు రాము గాయపడ్డాడు. హెచ్‌సీ ఈశ్వరరావు కథనం మేరకు.. విశాఖ నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న సమతా రైలురాక ను పట్టాలు దాడుతున్న వృద్ధుడు గమనించలేదు. దీంతో ఆ సమయం లో ఆయన కుడి కాలికి తీవ్ర గాయమైంది. ఈ షాక్‌తో ఆయన నోట మాట రాలే దు. తన గురించి ఏమీ చెప్పలేకపోయాడు. రైల్వే హెచ్‌సీ బండారు ఈశ్వర రావు గాయపడిన వ్యక్తికి సంబంధించిన వారెవ రైనా తమను సంప్రదించాలని ఫోటోతో సహా సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. తెలుసుకున్న బంధువులు పక్కి గ్రామం నుంచి వచ్చారు. దీంతో గాయపడిన వ్యక్తి రాముగా గుర్తించారు. అనంతరం స్థానిక సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మెరు గైన చికిత్స కోసం విజయనగరం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 09 , 2025 | 11:30 PM