ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stalled Constructions బిల్లులు చెల్లిస్తున్నా.. సాగని నిర్మాణాలు

ABN, Publish Date - Jan 12 , 2025 | 11:27 PM

Paying Bills but Stalled Constructions కూటమి ప్రభుత్వం గ్రామ సచివాలయాల నిర్మాణాలకు బిల్లులు చెల్లిస్తున్నా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. పనులు ఊపందుకోవడం లేదు. గతంలో కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన ద్వితీయ శ్రేణి నాయకులు సచివాలయ భవన నిర్మాణాలు పూర్తి చేయడానికి ఆసక్తి చూపడం లేదు.

జియ్యమ్మవలస మండలం కొండచిలకాం శిథిలావస్థ భవనంలో సచివాలయం నిర్వహిస్తున్న దృశ్యం

చొరవ చూపుతున్నా.. ముందుకురాని వైసీపీ కాంట్రాక్టర్లు

గత ప్రభుత్వ హయాంలో మంజూరైనవి 311

పనులు పూర్తయినవి 126

పార్వతీపురం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):

- జియ్యమ్మవలస మండలం కొండచిలకాం గ్రామంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల. ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొన్నాళ్లుగా పాఠశాలను నిర్వహించడం లేదు. అయితే ఈ భవనంలోని ఓ గదిలో సచివాలయం నిర్వహిస్తున్నారు. నూతన భవనం నిర్మాణం పూర్తికాకపోవడంతో ఇప్పటికీ అందులోనే సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. దీంతో వివిధ పనులపై ఇక్కడకు వచ్చేవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- మక్కువ మండలం మార్కొండపుట్టిలో గ్రామ సచివాలయం భవన నిర్మాణం సగంలో నిలిచిపోవడంతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్నాళ్లుగా అద్దె భవనంలోనే సచివాలయం నిర్వహిస్తున్నారు.

- సీతానగరం మండలం లక్ష్మీపురంలో గ్రామ సచివాలయ భవన నిర్మాణం పునాది స్థాయి దాటి పూర్తి కాలేదు. ఓ అద్దె ఇంటిలో కొంతకాలంగా సచివాలయం నిర్వహిస్తున్నారు. అయితే అది ఇరుకుగా ఉండగా, తరచూ ఆన్‌లైన్‌ సమస్యలు తలెత్తడంతో స్థానికులకు ఇక్కట్లు తప్పడం లేదు.

- భామిని మండలం నేరడి సచివాలయ భవన నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది. ప్రస్తుతం పంచాయతీ భవనంలోని ఓ ఇరుకు గదిలో సచివాలయం నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామస్థులకు, సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. బొడ్డగూడ, లివిరి, వడ్డంగి తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

... ఇలా జిల్లాలో అనేక చోట్ల గ్రామ సచివాలయాలు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్న గత వైసీపీ సర్కారు ప్రకటనలకే పరిమితమైంది. సచివాలయాల నిర్మాణాలకు బిల్లులు చెల్లించలేక చేతులెత్తేసింది. దీంతో వాటి పనులకు బ్రేక్‌ పడింది. గతంలో జిల్లాకు 311 గ్రామ సచివాలయాలు మంజూరు చేయగా.. ఇందులో 126 భవన నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 178 భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరో ఏడు భవనాలకు సంబంధించి పనులు ప్రారంభం కాలేదు. దీంతో అద్దె ఇళ్లలో, శిథిలావస్థ భవనాల్లో, పంచాయతీ కార్యాలయాల్లో పరాయి పంచన చాలీచాలని గదుల్లో సచివాలయాలను నిర్వహించాల్సి వస్తోంది. చిన్న చిన్న పనులు పూర్తికాక కొన్ని గ్రామ సచివాలయాలు ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. మొత్తంగా గత ప్రభుత్వ తీరుతో జిల్లాలో అనేక సచివాలయాలు సొంతగూడుకు నోచుకోవడం లేదు.

- క్షేత్రస్థాయిలో నెలకొన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం వాటి నిర్మాణాలకు బిల్లులు చెల్లిస్తున్నా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. పనులు ఊపందుకోవడం లేదు. గతంలో కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన ద్వితీయ శ్రేణి నాయకులు సచివాలయ భవన నిర్మాణాలు పూర్తి చేయడానికి ఆసక్తి చూపడం లేదు. గ్రామాల్లో భవన నిర్మాణాలు పూర్తి చేస్తే టీడీపీ నేతల హవా పెరిగిపోతుందని, తమ రాజకీయ పలుకుబడి తగ్గుతుందని కొందరు భావిస్తున్నట్లు తెలిసింది. ఇటువంటి వారు అధికారుల ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదు. దీనిపై కూటమి ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

జిల్లా పీఆర్‌ ఇంజనీరింగ్‌ శాఖ అధికారిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించా. గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

- నగేష్‌, జిల్లా పంచాయతీ రాజ్‌ శాఖ ఇంజనీరింగ్‌ అధికారి

Updated Date - Jan 12 , 2025 | 11:27 PM