ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇది రైల్వే బాదుడు!

ABN, Publish Date - Jan 09 , 2025 | 11:54 PM

railway charges is too hike తక్కువ చార్జీతో పాటు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవచ్చని పండుగ సమయాల్లో ఎక్కువ మంది రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ప్రయాణికుల అవసరాన్ని రైల్వే అలుసుగా తీసుకుని బాదుడుకు దిగుతోంది

ఇది రైల్వే బాదుడు!

ప్రీమియం తత్కాల్‌ పేరిట వడ్డన

పండుగ, పర్వదినాల్లో అదేతంతు

రద్దీ మార్గాలంటూ కొత్త నినాదం

ఇబ్బందిపడుతున్న ప్రయాణికులు

బొబ్బిలి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): తక్కువ చార్జీతో పాటు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవచ్చని పండుగ సమయాల్లో ఎక్కువ మంది రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ప్రయాణికుల అవసరాన్ని రైల్వే అలుసుగా తీసుకుని బాదుడుకు దిగుతోంది. సాధారణంగా ఏ సమయంలోనైనా రైల్వే టిక్కెట్‌ ధరలు స్థిరంగా ఉంటాయన్నది ప్రజల నమ్మకం. కానీ రైళ్లలో సైతం కనికట్టు చేస్తున్నారు. పండుగలు, ప్రత్యేక పర్వదినాలు, రద్దీగా ఉన్న రూట్ల పేరు చెప్పి దండిగా వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్‌లోనే టిక్కెట్ల ధర పెంపు చూశాం. ఇప్పుడు రైళ్లలోనూ అదే పంథా కొనసాగుతోంది. ప్రస్తుతం సంక్రాంతి సీజన్‌ నడుస్తోంది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబయి, కోల్‌కతా నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఇది మంచిదే అయినా.. ప్రీమియం తత్కాల్‌, తత్కాల్‌ పేర్లతో అదనపు వసూళ్లకు దిగుతుండడాన్ని అందరూ తప్పుబడుతున్నారు.

వెయిటింగ్‌ లిస్టు చూపి..

ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి విశాఖకు సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఈ రెండు రూట్ల మధ్య త్రీటైర్‌ ఏసీ టిక్కెట్‌ ధర అక్షరాలా రూ.770. అయితే ముందస్తు బుకింగ్‌లో భాగంగా రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ ఐఆర్‌సీటీసీలో వెయిటింగ్‌ లిస్టు చాంతాడు ఉంది. దాని పక్కనే టిక్కెట్‌ ధర రూ.1800 నుంచి రూ.2000 వరకూ ఉంటోంది. 80 శాతం కన్ఫర్మ్‌ అయ్యే చాన్స్‌ ఉంటుందంటూ చెబుతోంది. దీంతో అవసరం మనది కనుక.. బయట బస్సుల్లో అంతకంటే ఎక్కువ టిక్కెట్‌ ధర ఉండడంతో ఇట్టే బుక్‌ చేస్తున్నారు. అడ్డగోలు దోడిపీకి గురవుతున్నారు. ఇక ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ, టూటైర్‌ ఏసీ టిక్కెట్ల విషయంలో ముందస్తు బుకింగ్‌ చేసుకుంటూ మూడింతలు అదనంగా వసూలు చేస్తున్నారు.

తగ్గిన సేవాభావం..

గత కొంతకాలంగా రైల్వేశాఖలో సేవాభావం తగ్గింది. ఇప్పటివరకూ గూడ్స్‌ రవాణాలో ఆదాయమార్గాలను చూసుకునేది. ప్రజా రవాణా విషయంలో కాస్తా వెసులబాటు ఇచ్చేది. టిక్కెట్‌ ధరలు కూడా అదుపులో ఉండేవి. ఇప్పడు పూర్తిగా వ్యాపార ధోరణిలోకి మారిపోయినట్టు కనిపిస్తోంది. అచ్చం ప్రైవేటు ట్రావెల్స్‌ మాదిరిగా వ్యవహరిస్తోంది. ఆదాయం తక్కువ వస్తున్నాయని చెప్పి ప్యాసింజర్‌ రైల్‌ సర్వీసులను నిలిపివేసింది. కొవిడ్‌ తరువాత దాదాపు సూపర్‌ ఫాస్టు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను పెంచిన రైల్వేశాఖ ప్యాసింజర్ల విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. వందేభారత్‌ వంటి బుల్లెట్‌ రైళ్లు ప్రవేశపెట్టామని చెబుతున్న రైల్వేశాఖ.. అందులో గ్రామీణ ప్రాంత ప్రజలు ఎంతవరకు రాకపోకలు సాగిస్తున్నారన్నది మాత్రం గుర్తించడం లేదు.

Updated Date - Jan 09 , 2025 | 11:54 PM