రిటైర్‌మెంట్ వయస్సు 62కు పెంచాలి
ABN, Publish Date - Apr 05 , 2025 | 12:18 AM
మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు రిటైర్‌మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని, గ్రాడ్యూటీ, పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎన్‌వీ నాయుడు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు డిమాండ్ చేశారు.

పాలకొండ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు రిటైర్‌మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని, గ్రాడ్యూటీ, పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎన్‌వీ నాయుడు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. గత మున్సిప ల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేటి ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.గంగునాయుడు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సీహెచ్ సంజీవి, పి.వేణు, సురేష్, శ్రీదేవి, విమల, రఘు, వండాన ఆంజనేయులు పాల్గొన్నారు.
Updated Date - Apr 05 , 2025 | 12:18 AM