మా భూములు కాపాడండి
ABN, Publish Date - Jan 04 , 2025 | 11:46 PM
తమ భూము లు కాపాడాలని కోరుతూ కాశిం దొరవలస గ్రామస్థులు శనివా రం స్థానిక తహసీల్దార్ కార్యా లయంలో డీటీ డీకేవీ సుబ్బారా వుకు వినతిపత్రం అందజేశారు.
బొబ్బిలి రూరల్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): తమ భూము లు కాపాడాలని కోరుతూ కాశిం దొరవలస గ్రామస్థులు శనివా రం స్థానిక తహసీల్దార్ కార్యా లయంలో డీటీ డీకేవీ సుబ్బారా వుకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడు తూ గ్రామంలోని ఎస్టీ, బీసీ కులాలకు చెందిన నిరుపేద కుటుంబాలు కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం మంజూరు చేసిన ఎల్‌సీసీ పట్టా భూములను సాగు చేసుకుంటున్నామని చెప్పారు. అయితే ఇటీవల కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తమ భూములకు ఆనుకుని గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. తాము అడ్డుకోగా సంబంధం లేని సమాధానాలు ఇస్తున్నారని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాటుపడతారోనని భయంగా ఉందన్నారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి వారిని అక్కడ నుంచి తొలగించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Updated Date - Jan 04 , 2025 | 11:46 PM