పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలి

ABN, Publish Date - Mar 24 , 2025 | 12:23 AM

ప్రాథమికోన్నత పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని, ప్రతి పంచాయతీకి ఒక మోడల్‌ స్కూల్‌ను మంజూరు చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహన్‌ రావు డిమాండ్‌ చేశారు.

పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలి

వీరఘట్టం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ప్రాథమికోన్నత పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని, ప్రతి పంచాయతీకి ఒక మోడల్‌ స్కూల్‌ను మంజూరు చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహన్‌ రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఈనెల 25న జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించనున్నామని చెప్పారు. ఈ ర్యాలీని విజయవంతం చేయా లని కోరుతూ ఆదివారం కిమ్మి గ్రామంలో ‘మన ఊరు బడిని కాపాడుకుం దాం’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ స్టేట్‌ కల్చరల్‌ కమిటీ మెంబర్‌ కొండపల్లి గౌరునాయుడు, జిల్లా కార్యదర్శి మజ్జి పైడి రాజు, జిల్లా కౌన్సిలర్‌ అరసాడ చంద్రమోహన్‌, కర్రి సింహచలం, వీరఘట్టం మండల కోశాధికారి బోనంగి వాసుదేవరావు, సీతంపేట నాయ కులు శిలా గణేష్‌, కిమ్మి గ్రామ సర్పంచ్‌ గురాన రామ్మోహన్‌నా యుడు, గడగమ్మ గ్రామ సర్పంచ్‌ ఉదయాన సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 12:23 AM