ముగిసిన కల్యాణ మహోత్సవాలు
ABN, Publish Date - Feb 09 , 2025 | 11:16 PM
చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామ దేవస్థానాల్లో స్వామివార్ల కల్యాణ మహోత్సవాలు ఆదివారం ముగిశాయి.

- 12న వేంకటేశ్వరుని చక్రతీర్థ స్నానం
గరుగుబిల్లి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామ దేవస్థానాల్లో స్వామివార్ల కల్యాణ మహోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ నెల 5 నుంచి 8 వరకు నూతన విగ్రహ పునఃప్రతిష్టతో పాటు నూతన ఆలయాల ప్రారంభం అత్యంత వైభవంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఈ నెల 12న పవిత్ర నాగావళి నదీ తీరంలో వేంకటేశ్వర స్వామివారి శ్రీచూర్ణోత్సవం, శ్రీచక్ర తీర్థ స్నానం నిర్వహించనున్నట్ల దేవస్థానం ఈవో వీవీ సూర్యనారాయణ, తోటపల్లి దేవస్థానాల అభివృద్ధి సేవా ట్రస్టు అధ్యక్ష, కార్యదర్శులు డి.ధనుంజయరావు, డాక్టర్ డి.పారినాయుడులు తెలిపారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.
Updated Date - Feb 09 , 2025 | 11:16 PM