name change తాటిపూడి పేరు మారింది
ABN, Publish Date - Jan 02 , 2025 | 11:29 PM
The name of Tatipudi has changed తాటిపూడి జలాశయానికి స్వాతంత్ర సమరయోధుడు జామి మండలానికి చెందిన గొర్రిపాటి బుచ్చి అప్పారావు (జీ.బీ అప్పారావు) రిజర్వాయర్‌గా పేరును కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది.
తాటిపూడి పేరు మారింది
గొర్రిపాటి బుచ్చి అప్పారావు రిజర్వాయర్‌గా పునరుద్ధరణ
తాజాగా ఉత్తర్వులు జారీ
శృంగవరపుకోట, జనవరి 2(ఆంధ్రజ్యోతి): తాటిపూడి జలాశయానికి స్వాతంత్ర సమరయోధుడు జామి మండలానికి చెందిన గొర్రిపాటి బుచ్చి అప్పారావు (జీ.బీ అప్పారావు) రిజర్వాయర్‌గా పేరును కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు గురువారం జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంతో పాటు అనేక సంస్థల పేర్లను మార్చేసింది. రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ఆ చర్యలకు పాల్పడింది. వాటి పేర్లు పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తాటిపూడి రిజర్వాయర్‌కు పెట్టిన బుచ్చి అప్పారావు పేరు పునరుద్ధరణకు నోచుకుంది. శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఈ విషయాన్ని శాసన సభలోను ప్రస్తావించారు. ఈ ప్రాంత ప్రజాభిప్రాయాన్ని గౌరవించిన ప్రభుత్వం తిరిగి జలాశయానికి బుచ్చి అప్పారావు పేరు పెట్టింది.
Updated Date - Jan 02 , 2025 | 11:29 PM