insurence ఫసల్ బీమా నమోదులో మూడో స్థానం
ABN, Publish Date - Jan 03 , 2025 | 11:24 PM
Third position in crop insurance registration కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి సంబంధించి పెసర, మినుము పంటల నమోదులో రాష్ట్రస్థాయిలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఈ పంటలకు 88,059 మంది రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు.
ఫసల్ బీమా నమోదులో
మూడో స్థానం
పెసర, మినుము పంటలకు 88 వేల మంది రైతుల నమోదు
గంట్యాడలో అత్యధికం.. చీపురుపల్లిలో అత్యల్పం
గడువు పెంచాలని కోరుతున్న రైతులు
విజయనగరం కలెక్టరేట్, జనవరి 3(ఆంధ్రజ్యోతి):
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి సంబంధించి పెసర, మినుము పంటల నమోదులో రాష్ట్రస్థాయిలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఈ పంటలకు 88,059 మంది రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం గడువు పూర్తికాగా చివరి నాలుగు రోజులు ఆధిక సంఖ్యలో రైతులు బీమా నమోదు చేసుకున్నారు. గతంలో కంటే ఈ సారి రైతుల్లో బీమాపై అవగాహన పెరిగింది. మరోవైపు వరి పంట ఇంటికి చేరే సమయంలో వర్షాలు కురవడంతో అపరాలైన పెసర, మినుము పంటలకు తీవ్ర నష్టం జరిగింది. దీంతో మళ్లీ ఇలాంటి పరిస్థితి వస్తే గట్టెక్కే ఉపాయం బీమా మాత్రమేనని నమ్మి బీమా కోసం ఆన్‌లైన్‌లో అధిక సంఖ్యలో నమోదు చేసుకున్నారు. కాగా మామిడి రైతులు కూడా ఎక్కువగా దరఖాస్తు చేసుకు న్నారు. జిల్లాలో మామిడి పంటకు పునర్వవ్యవస్థీకరించబడిన వాతా వరణ పంటల ఆధారిత బీమా పథకం(ఆర్‌డబ్య్లూబీసీఐఎస్) అమలుకు అగ్రికల్చర్ ఇన్యూరెన్స్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
రబీ సీజన్‌లో ప్రధానంగా సాగుచేస్తున్న మినుము, పెసర, మొక్కజొన్న, వరి పంటలకు బీమా సౌకర్యం ఉంది. గత నెల 15 వరకే నమోదుకు అవకాశం ఇచ్చారు. మొదట్లో రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో డిసెంబరు 31 వరకు గడువు పెంచారు. డిసెంబరు చివరి వారంలో ఎక్కువ సంఖ్యలో సీఎస్‌సీ కేంద్రాలకు వెళ్లి బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 88059 మంది రైతులు ముందుకొచ్చారు. గంట్యాడ మండలంలో ఎక్కువ మంది రైతులు, చీపురుపల్లి మండలంలో అత్యల్ప సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. కాగా మరో రెండు రోజులు గడువు పెంచాలని రైతులు కోరుతున్నారు. ఇదే విషయమై వ్యవసాయ శాఖ జేడీ తారాక రామారావు వద్ద ప్రస్తావించగా ఈ సమస్యను రాష్ట్ర కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు.
Updated Date - Jan 03 , 2025 | 11:24 PM