ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ముగ్గు’ మనోహరం

ABN, Publish Date - Jan 05 , 2025 | 12:47 AM

'Three' is lovely సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా... హరివిల్లు నేలపై విరిసినట్టుగా అక్కడ ముగ్గులు పూశాయి. మహిళల ప్రతిభకు అద్దం పట్టాయి. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ సంతూర్‌ ముగ్గుల పోటీలు విజయనగరంలోని తోటపాలెంలోని ఎయిమ్‌ స్కూల్‌ మైదానం వేదికగా శనివారం నిర్వహించారు.

విజయనగరంలోని తోటపాలెంలో ఎయిమ్‌ స్కూల్‌ ఆవరణలో ముగ్గులు వేస్తున్న మహిళలు

‘ముగ్గు’ మనోహరం

ఉత్సాహంగా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముగ్గుల పోటీలు

సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టిన వైనం

ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌ మలికాగార్గ్‌ హాజరు

పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు

(ఆంధ్రజ్యోతి బృందం)

సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా... హరివిల్లు నేలపై విరిసినట్టుగా అక్కడ ముగ్గులు పూశాయి. మహిళల ప్రతిభకు అద్దం పట్టాయి. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ సంతూర్‌ ముగ్గుల పోటీలు విజయనగరంలోని తోటపాలెంలోని ఎయిమ్‌ స్కూల్‌ మైదానం వేదికగా శనివారం నిర్వహించారు. విజయనగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి 84 మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్‌ వారి పర్‌ఫెక్ట్‌, ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌) ఆధ్వర్యంలో ఈ పోటీలు వైభవంగా జరిగాయి. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ పోటీలు 12.30 గంటలకు ముగిశాయి. వివిధ రంగాలకు చెందిన జి.శిరీష, కల్పనా కుక్రేజా, దేవి ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌ మలికాగార్గ్‌ ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఇటువంటి కార్యక్రమాలు మహిళలకు ఎంతో ఉత్సా హన్నిస్తాయన్నారు. ప్రతి ఏటా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం హర్ష ణీయమన్నారు. సంక్రాంతి పండుగ ఎంతో ఆనందా న్ని ఇచ్చేదని తెలిపారు. యువతీ యువకులకు సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను తెలిపేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహద పడ తాయని ఆమె తెలిపారు. భవిష్యత్‌లో కూడా ఇటు వంటి కార్యక్రమాలను నిర్వాహకులు కొనసాగించా లని ఆమె సూచించారు. ప్రముఖ గైనకాలజిస్ట్‌, డాక్టర్‌ పి.సన్యాసమ్మ మాట్లాడుతూ ఎంతో సమ యం వెచ్చించి, కష్టపడి మహి ళలు వేసిన ముగ్గుల్లో వారి ప్రతిభ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో ఏటా ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ ఎన్నో వ్యయ,ప్రయాసలకు ఓర్చి, వాణిజ్య సంస్థలతో కలిసి ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమన్నారు. విద్యార్థినులు, మహిళలు ఎన్నో సమస్యలతో తన వద్దకు వస్తున్నారన్నారు. ముఖ్యంగా రక్తహీనత, రుతుస్రావం క్ర మంగా అవ్వకపోవడం, బీపీ, షుగర్‌ వంటి వ్యాధులతో మహి ళలు తన వద్దకు రావడం ఎంతో బాధగా ఉందన్నారు. మహిళలు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థి నులు ఇంట్లో తల్లికి వంట, ఇంటి పనిలో సహకరించాలని హితవు పలికారు. దీనివల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చని చెప్పారు. లోకల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించిన ఎయిమ్‌ స్కూల్స్‌ అధినేత కడగల ఆనందకుమార్‌ మాట్లాడుతూ, అంతరించిపోతున్న ముగ్గు అనే కళను బయటకు తీసుకురావడమే కాకుండా... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏటా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ’ సంస్థలు పోటీలు నిర్వహించడం హర్షణీయమన్నారు. లోకల్‌ స్పాన్సర్‌గా తమకు అవకాశం కల్పించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి బింబించేలా... ఈ ముగ్గుల పోటీలు కొత్తశోభను తీసుకువచ్చాయని అన్నారు. విజయనగరం జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు అవనాపు భార్గవి మాట్లాడుతూ, ముగ్గుల పోటీలు సంక్రాంతి శోభను తీసుకువచ్చాయన్నారు. ఇవి మహిళల శారీరక, మానసిక వికాసానికి దోహద పడతాయని అన్నారు. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన జి.శిరీష, కల్పనా కుక్రేజా, ఎ.దేవిలు మాట్లాడుతూ... ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ నిర్వహించిన ఈ పోటీల్లో మహిళలు మంచి ముగ్గులు వేశారని ప్రశంసించారు. నిబంధనల ప్రకారం తాము మార్కులు వేశా మన్నారు. ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ భవిష్యత్తులో కూ డా పోటీలను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఎయిమ్‌ స్కూల్‌ ఏఓ బాలాజీ, సిబ్బంది, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

చాలా సంతోషంగా ఉంది..

యువత మరిచిపోతున్న కళకు ‘ఆంధ్రజ్యోతి’ ఏటా ప్రాణం పోస్తోంది. సంస్థ నిర్వహిస్తున్న ముగ్గుల పోటీల్లో పాల్గొని మొదటి బహుమతి సాధించడం చాలా ఆనందంగా ఉంది. గతంలో ‘ఆంద్రజ్యోతి-ఏబీఎన్‌’ నిర్వహించిన ముగ్గుల పోటీల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం వచ్చింది. ఈ ఏడాది కూడా రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తాం. చుక్కల ముగ్గులు వేయడంలో ప్రావీణ్యం ఉండాలి. ముగ్గులు వేయడాన్ని నిత్యం సాధన చేస్తాను. పాటలు పాడుతాను. ప్రతి ఇంటి ముందు కళ్లాపు జల్లి, ముగ్గులు వేయడంలో సైన్సు దాగి ఉంది. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ సంస్థ ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం వల్ల మరెంతమందికో స్ఫూర్తి కలుగుతుంది.

-ములుగు రాజు, ప్రథమ విజేత

బహుమతి రావడం ఆనందంగా ఉంది..

ముగ్గుల పోటీల్లో రెండో బహుమతి రావడం ఆనందంగా ఉంది. తెలుగు సంప్రదాయబద్ధంగా ముగ్గులు వేశాం. నేను సంక్రాంతి పండుగ ముందే కాకుండా నిత్యం ముగ్గులు వేస్తాను. ప్రతి రోజు ముగ్గులు వేయడం వల్ల వ్యాయామం అవుతుంది. ప్రతి ఇంటి ముందు మహిళలు ముగ్గులు వేస్తే పిల్లలు నేర్చు కుంటారు. ప్రతి మహిళ వారి పిల్లలకు ముగ్గులు వేయడం నేర్పించాలి. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న ‘ఆంధ్రజ్యోతి -ఏబీఎన్‌’ సంస్థలకు అభినందనలు.

-కనకల అరుణ, ద్వితీయ బహుమతి విజేత

పోటీల కోసమే వచ్చా..

నేను హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాను. ‘ఆంధ్రజ్యోతి -ఏబీఎన్‌’ నిర్వహించిన ముగ్గుల పోటీల కోసం ఇక్కడికి వచ్చాను. ముగ్గుల పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఈ పోటీల్లో మూడో బహుమతి వచ్చింది. గతంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి వచ్చింది. బాలికలు విద్యార్ధి దశ నుంచి ముగ్గులు వేయడం నేర్చుకుంటే మంచిది. అలాగే తల్లిదండ్రులు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించేలా ఆడపిల్లలకు ముగ్గులు నేర్పించాలి.

-టి.సింధుజ, తృతీయ బహుమతి విజేత

Updated Date - Jan 05 , 2025 | 12:47 AM