Three Years Passed... Still There మూడేళ్లయినా.. అక్కడే!

ABN, Publish Date - Mar 22 , 2025 | 11:18 PM

Three Years Passed... Still There ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా జిల్లా కేంద్రంలోనే ఉంటాయి. అయితే డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. నేటికీ అది జిల్లా కేంద్రానికి దూరంగానే ఉంది. ప్రస్తుతం పాలకొండలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం ఉంది. అక్కడ నుంచే జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయ నిర్వహణ జరుగుతుంది. దీంతో జిల్లావాసులకు ఇబ్బందులు తప్పడం లేదు.

Three Years Passed... Still There మూడేళ్లయినా.. అక్కడే!
పాలకొండలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ జిల్లా కార్యాలయం
  • జిల్లాకేంద్రానికి తరలించని వైనం

  • ప్రజలకు తప్పని ఇబ్బందులు

పార్వతీపురం, మార్చి22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా జిల్లా కేంద్రంలోనే ఉంటాయి. అయితే డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. నేటికీ అది జిల్లా కేంద్రానికి దూరంగానే ఉంది. ప్రస్తుతం పాలకొండలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం ఉంది. అక్కడ నుంచే జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయ నిర్వహణ జరుగుతుంది. దీంతో జిల్లావాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా ఏర్పడి మూడేళ్లవుతున్నా.. ఇంకా ఆ కార్యాలయాన్ని పార్వతీపురానికి తరలించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఎవరైనా పార్వతీపురం, సాలూరు నుంచి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయానికి వెళ్లాలంటే ఇరువైపులా సుమారు 120 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వస్తోంది. దూరాభారం కావడంతో జిల్లావాసులు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జిల్లా కేంద్రం పార్వతీపురంలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ..

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయాన్ని పాలకొండలో నిర్వహిస్తున్నాం. అందుబాటులో ఉంటూ పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నాం.

- ఆశా షేక్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, పార్వతీపురం మన్యం జిల్లా...

Updated Date - Mar 22 , 2025 | 11:18 PM