ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టిఫిన్‌ దుకాణం దగ్ధం

ABN, Publish Date - Jan 14 , 2025 | 12:37 AM

సీతంపేట గ్రామంలో వారపు సంత ఆవరణలో ఉన్న గొర్లె ప్రకాశరావుకు చెందిన టిఫిన్‌ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

సీతంపేట రూరల్‌, జనవరి 13(ఆంధ్రజ్యోతి): సీతంపేట గ్రామంలో వారపు సంత ఆవరణలో ఉన్న గొర్లె ప్రకాశరావుకు చెందిన టిఫిన్‌ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా దుకాణంలో మంటలు చెలరేగినట్లు బాధితుడు తెలిపాడు. మంటలను అదుపు చేసేందుకు ఎంత మంది ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడడంతో అదుపు చేసేందుకు ఎవరూ వెళ్లే సాహసం చేయలేకపోయారు. మరో పక్క గ్యాస్‌ సిలిండర్‌కు మంటలు అంటుకోవడంతో చుట్టుపక్కల వాళ్లు పరుగులు తీశారు. ఈ అగ్నిప్రమాదంలో దుకాణంలో ఉన్న ద్విచక్ర వాహనం, ఫ్రిజ్‌, మంచం, గ్యాస్‌స్టవ్‌, గ్యాస్‌ సిలండర్‌, గ్రైండ ర్లు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న పాలకొండ ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను కొంత వరకు అదుపుచేశారు. సుమారు రూ.2లక్షల ఆస్తినష్టం ఉంటుందని పాలకొండ ఫైర్‌స్టేషన్‌ అధికారి జామి సర్వేశ్వరరావు చెప్పారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.

Updated Date - Jan 14 , 2025 | 12:37 AM