డోలీ మోతలకు స్వస్తి పలికేందుకే..
ABN, Publish Date - Jan 11 , 2025 | 12:24 AM
కురుపాం నియోజకవర్గంలో డోలీ మోతలకు స్వస్తి పలకాలన్న లక్ష్యంతోనే గిరి శిఖర గ్రామాలకు పక్కా రహదారుల నిర్మాణాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు.
ప్రభుత్వ విప్ జగదీశ్వరి
కొమరాడ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): కురుపాం నియోజకవర్గంలో డోలీ మోతలకు స్వస్తి పలకాలన్న లక్ష్యంతోనే గిరి శిఖర గ్రామాలకు పక్కా రహదారుల నిర్మాణాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. మండలం లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆమె శుక్రవారం ప్రారంభించారు. పేడేసు పంచాయతీ లంజి గ్రామం నుంచి గూనకల్లు గ్రామం వరకు బీటీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన సిమెంటు రహదారులను, గోశాలల షెడ్లును ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ మండల కన్వీనర్ ఉదయశేఖరపాత్రుడు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గరుగుబిల్లి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శివ్వాంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.3 లక్షలతో నిర్మించిన రహదారిని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శుక్రవారం ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం నిధులతో పెద్దూరు, మరుపెంట, శివ్వాం, తోటప ల్లితో పాటు పలు పంచాయతీల్లో సుమారు రూ.25 లక్షల నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. అనంతరం పలువురు రైతులు నిర్మించిన గోశాలలను ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ అక్కేన మధుసూదనరావు, రాష్ట్ర ప్రతినిధులు ఎం.పురుషోత్తంనాయుడు, ఎం.తవిటి నాయుడు, అంబటి రాంబాబు, పి.పాపినాయుడు, డి.ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 11 , 2025 | 12:24 AM