నేడే ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ముత్యాల ముగ్గుల పోటీలు
ABN, Publish Date - Jan 03 , 2025 | 11:10 PM
Today: 'Andhra Jyothi-ABN' Muggula Competition సంక్రాంతి సమీపిస్తోంది. పండుగ నేపథ్యంలో ఏటా మాదిరి ఈ ఏడాదీ ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీల నిర్వహణకు రంగం సన్నద్ధమైంది.
ఏర్పాట్లు పూర్తి
విజేతలకు భారీగా నగదు పురస్కారాలు...
పార్వతీపురం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సమీపిస్తోంది. పండుగ నేపథ్యంలో ఏటా మాదిరి ఈ ఏడాదీ ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీల నిర్వహణకు రంగం సన్నద్ధమైంది. ‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలకు.. గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ వారి సెల్సియా(ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్)’’ సహకారం అందించ నున్నాయి. మహిళలు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని.. అందమైన ముగ్గులు వేసి.. ఆకర్షణీయమైన బహుమతులను గెలుచుకోవాలని ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ పిలుపునిస్తోంది.
పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో శనివారం మత్యాల ముగ్గుల పోటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పోటీలకు పార్వతీపురంతో పాటు సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలతో పాటు పలు మండలాల నుంచి మహిళలు తరలిరానున్నారు. ఆకర్షణీయమైన మూడు ముగ్గులను న్యాయనిర్ణేతలు ఎంపిక చేసి విజేతలకు బహుమతులతో పాటు నగదు పురస్కారాన్ని అందజేస్తారు. ప్రథమ విజేతకు రూ.6వేలు, ద్వితీయ విజేతకు రూ.4వేలు, తృతీయ విజేతకు రూ.3వేలతోపాటు మెమొంటోలు ఇస్తారు. పోటీల్లో పాల్గొన్న మహిళలకు కన్సొలేషన్ బహుమతులు కూడా అందజేస్తారు. ఈ ముగ్గుల పోటీలకు స్థానిక స్పాన్సర్‌గా శ్రీవెంకటేశ్వర జ్యూయల్ ప్యాలెస్ వ్యవహరిస్తోంది. ముఖ్య అతిథులుగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ మాధవరెడ్డి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర హాజరు కానున్నారు. జిల్లా స్థాయిలో విజేతను ఈ నెల 11న విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు. రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో ఏకంగా రూ.1.50 లక్షల విలువైన బహుమతులను గెలుచుకోవచ్చు.
Updated Date - Jan 03 , 2025 | 11:10 PM